బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి కేసులో రిమాండ్ రిపోర్ట్

నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంపై దాడి కేసులో పోలీసులు రిమాండ్ రిపోర్టు సిద్ధమైంది.

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగానే దాడికి ప్లాన్ చేశారని పోలీసులు తెలిపారు.

అందులో భాగంగానే ఇంటిపై దాడి చేసి పూజాసామాగ్రి, హాల్ తో పాటు వాహనాలను ధ్వంసం చేశారని పేర్కొన్నారు.

బందోబస్తు లేకపోవడంతో నిందితులు దాడికి తెగబడ్డారని చెప్పారు.దాడి చేసిన తొమ్మిది మందిలో ఇద్దరు పీహెచ్డీ విద్యార్థులున్నారని పోలీసులు వెల్లడించారు.

అదేవిధంగా ఘటనలో రెండు సిమెంట్ రాళ్లు, రెండు కర్రలతో పాటు టీఆర్ఎస్ జెండాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

41 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడంతో బెయిల్ మంజూరైందని స్పష్టం చేశారు.

రవితేజకు అదే మైనస్ అవుతోందా.. ఆ స్టార్ హీరోలను చూసి రవితేజ మారాల్సిందేనా?