మిగిలిన అన్నాన్ని అమృతంగా మార్చి.. ఏం చేస్తున్నారంటే?

చాలామంది కేవలం ఒక్క పూట భోజనం తిని బ్రతికే వాళ్ళు ఉన్నారు సమాజంలో.

ఒక పూట భోజనం కోసం ఎన్నో తాపత్రయాలు పడతారు.ఇప్పటికీ పేదరిక సమస్య అందరిని ఇబ్బంది పెడుతూనే ఉంది.

ఏమి సంపాదించలేక, ఒక్క పూట కడుపు నింపుకోవడం కోసం ఎన్నో పాట్లు పడతారు.

ఇలా ఉంటే ఇలాంటి వాళ్ల కోసం మనసున్న ఓ గొప్ప మహిళ అందరి కడుపులు నింపుతుంది.

గుంటూరుకు చెందిన కొప్పురావూరు రజని.ఈమె ఎంతోమంది పేదల కడుపు నింపుతుంది.

ఈమెకు 30 ఏళ్ళ నుండి దుస్తుల దుకాణం ఉంది.ఆ షాపులో పనిచేసే వ్యక్తులు పొద్దున తెచ్చుకున్న ఆహారం మధ్యాహ్నానికి పాడై పోయేది.

దీంతో వాళ్లు ఏమీ తినలేని పరిస్థితి గా మారేది.మన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బులతో ఖర్చు చేసి బయట తినకుండా.

ఉపవాసం ఉండే వాళ్ళు.దీంతో ఈ విషయం తెలిసిన రజనికి ఒక గొప్ప ఆలోచన వచ్చింది.

ఆమె తమ దగ్గర పనిచేసే వాళ్లకు మధ్యాహ్న భోజనాన్ని పెట్టాలనుకుంది.దీంతో ఈ విషయం గురించి వాళ్ళ ఇంటి సభ్యులు కూడా ఒప్పుకున్నారు.

అలా చేస్తున్న తరుణంలోనే ఫీవర్ ఆస్పత్రి లో రోజుకు 150 మందికి అన్నం వండి పెట్టేదట.

ఇలా ఈ విధంగానే కాకుండా వాళ్ళ ఇంట్లో ఏదైనా చిన్న వేడుక జరిగితే మిగిలిన అన్నాన్ని అనాథ శరణాలయకు, వసతి గృహాలకు, రోడ్డు పక్కన ఉండే పేదోళ్లకు పెట్టేవారని తెలిపింది.

అంతేకాకుండా ఇతరుల ఇంట్లో ఏదైనా వేడుక జరిగే మిగిలిన అన్నం ఉంటే వాటిని సేకరించుకుని పేదలకు పెట్టేవారట.

"""/"/ అమృతమయి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వేలాది మంది కడుపు నింపుతున్నారు.ఇలా ఎలా ట్రస్ట్ ను పెట్టాలనే ఆలోచన ఆమెకు కలగడంతో.

ఆహార రవాణాకు ఓ వాహనం, డ్రైవర్, కొన్ని వంట సామాగ్రి ఏర్పాటు చేసుకున్నామని తెలిపింది.

అంతేకాకుండా కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్ లో మిగిలిన అన్నం అంటే మాకు ఫోన్ చేయండి అంటూ కరపత్రాలు కూడా ఏర్పాటు చేశారట.

ఇటీవలే ఓ చోట వేడుక జరుగగా వాళ్ళు వండిన ఆహారానికి తక్కువ మంది రావడంతో మిగిలిన అన్నాన్ని ఏం చేయలేక ఆలోచిస్తున్న ఓ ఓ కుటుంబం దగ్గరకు విషయం తెలుసుకొని అమృతమయి చారిటబుల్ ట్రస్ట్ వెళ్ళింది.

దీంతో ఆహారం ను కొన్ని క్షణాల్లోనే పేదల కడుపు నింపారు.ఇదిలా ఉంటే భవిష్యత్తులో ఆహారం నిల్వ చేసే పద్ధతిలో ఏర్పాటు చేస్తామని రజని తెలిపింది.

బిగ్‌బాస్‌ని నమ్మి పెద్ద తప్పు చేసిన సోనియా.. ఇప్పుడేదో చేస్తుందట..?