పుష్కరాల బస్సుల కోసం ఇతర డిపోలపై ఆధారపడాలా?

సూర్యాపేట జిల్లా:ప్రాణహిత పుష్కరాలకు వెళ్లాలంటే, సూపర్ లగ్జరీ బస్సులు కావాలంటే కోదాడ,నల్లగొండ, మిర్యాలగూడ నుండి తీసుకోవాల్సిందేనా? లేక ప్రైవేటు వాహనాలపై ఆధారపడాల్సిందేనా? భక్తులపై అదనపు భారం తప్పదా?ఆర్టీసీకి ఆదాయం వద్దా?అయితే ఇది ఎవరి లోపం? వివరాల్లోకి వెళితే.

ఈనెల 13 నుండి 24 వరకు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలో జరుగుతున్న ప్రాణహిత పుష్కరాలకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని టీఎస్ ఆర్టీసీ డిపో నుండి వెళ్లేందుకు అవకాశం ఉందా అంటే అనుమానమే అని సమాధానం వినిపిస్తోంది.

దేశంలో ఎక్కడ పుష్కరాలు జరిగినా ఎక్కువగా వయసు మళ్ళిన వారు,మరి కొంతమంది కుటుంబ సమేతంగా వెళుతుంటారు.

ఇలాంటి సందర్భాల్లో ప్రయాణం సాఫీగా సాగాలంటే సూపర్ లగ్జరీ బస్సులు పుష్ బ్యాక్ తో కొంచెం అనువుగా ఉంటాయి.

కానీ, సూర్యాపేట నుండి కాళేశ్వరం వెళ్లాలంటే సూర్యాపేట డిపోలో సూపర్ లగ్జరీ బస్సులు లేవు.

ఒకవేళ సూపర్ లగ్జరీ బస్సులు కావాలంటే మిర్యాలగూడ,కోదాడ, నల్గొండ డిపోల నుండి అరువు తెచ్చుకోవాల్సిందేనని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

అదే జరిగితే భక్తులకు అదనపు భారం తప్పదని భావిస్తున్నారు ప్రయాణికులు.సూర్యాపేట నుండి సూపర్ లగ్జరీ బస్సులు లేకపోవడంతో భక్తులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించక తప్పని పరిస్థితి.

భక్తుల ఇబ్బందులను, పుష్కర ప్రయాణికుల అవస్థలను దృష్టిలో ఉంచుకుని జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి చొరవ తీసుకొని, పుష్కరాలకు వెళ్లే వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

రజినీకాంత్ ను టార్గెట్ చేసిన స్టార్ డైరెక్టర్లు…