ఎన్టీఆర్ ఇచ్చిన సలహాను పట్టించుకోని రేలంగి.. ఆ పని చేసి ఉంటె ఈ రోజు మరోలా ఉండేది
TeluguStop.com
రేలంగి వెంకట్రామయ్య.టాలీవుడ్ లో సీనియర్ మోస్ట్ కమెడియన్ .
ముద్దుగా అందరు రేలంగి అంటూ ఉంటారు.రేలంగితో ఎన్టీఆర్ కి మంచి స్నేహం ఉండేది.
ఎన్టీఆర్ కృష్ణ జిల్లా ప్రాంతానికి చెందిన వ్యక్తి కానీ రేలంగి మాత్రం వెస్ట్ గోదావరి జిల్లా కి చెందిన వారు.
సినిమాల విషయంలో రేలంగి అన్న గారి కంటే కూడా సీనియరు నటులు.ఎన్టీఆర్ కన్నా ఒక ఐదారేళ్ళ ముందుగానే ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చారు.
కానీ మొదట్ల చిన్న చితకా వేషాలు వేసేవారు.నిజానికి అయన నేరుగా నటుడిగా మారలేదు.
రేలంగి ఎంట్రీ చాల చిత్రం గా జరిగింది.మద్రాసులో పీతాంబరం అనే వ్యక్తి సినిమాలకు జూనియర్ ఆర్టిస్టులను సప్లై చేసేవారు.
ఆయనకు అసిస్టెంట్ గా రేలంగి పని చేసేవారు.అయితే ఒక రోజు చిన్న వేషానికి కావాల్సిన మనిషి రాకపోవడం తో అతని స్థానం లో రేలంగి ని పెట్టారట.
అక్కడ నుంచి మొదలు.తిరుగులేని కమెడియన్ గా చిరస్థాయిగా నిలిచారు.
మొదట్లో చిన్న చిన్న పాత్రల్లో నటించడానికి అవకాశాలు వచ్చేవి.కానీ అయన ఆహార్యం, టైమింగ్, మాట తీరు బాగా ఉండటం అవకాశాలు పెరిగాయి.
ఒక వైపు నటుడిగా ఉంటూనే మరో వైపు వైపు ఆర్టిస్టులను సప్లై చేయడం మాత్రం ఆపలేదు.
వేరు వేరు ప్రాంతాల నుంచి మనుషులను తెప్పించి సినిమాల్లో నటింప చేసేవారు.అదే ఆయనకు ఉన్న ప్రధాన కర్తవ్యం అప్పటి రోజుల్లో.
ఎన్టీఆర్ సినిమాల్లో నటించడానికి మద్రాసు వచ్చిన రోజుల్లో ఎన్టీఆర్ కి రేలంగి సహాయం చేశారట.
"""/"/
సినిమా లొకేషన్ లో కూడా ఇద్దరు ఎప్పుడు కలిసే ఉండేవారు.కొన్నాళ్ల పాటు వారి స్నేహం బాగానే సాగింది.
ఒకరితో ఒకరు ఇచ్చిపుచ్చుకోవడాలు వంటి ఆర్థిక కార్యకలాపాలు కూడా చేసేవారు.అయితే చిక్కంతా వచ్చింది ఇక్కడే.
రేలంగి కి చదువులేదు.చేతిలో చాల డబ్బు ఉన్న ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలంటే భయపడే వారు.
దాంతో ఏదైనా సలహా కోసం రేలంగి ఎక్కువగా అన్న గారిని సంప్రదించేవారు.ఆలా ఎన్టీఆర్ సలహాతో వెస్ట్ గోదావరి లో ఒక థియేటర్ కూడా కట్టించారట.
దాని బాధ్యతను తన కొడుకు సత్యనారాయణకు అప్పచెప్పారట రేలంగి.అయితే ఎన్టీఆర్ సూచనలు ఇన్ని పాటించిన రేలంగి అతడి కొడుకుని హీరో చేయమని ఎన్ని సార్లు చెప్పిన వినలేదట.
తాను ఇచ్చిన సలహా పట్టిన్చుకోలేదని ఒకటి రెండు సార్లు ఎన్టీఆర్ ఫీల్ అయ్యారట.
ఒడియా అబ్బాయిని పెళ్లాడిన అమెరికన్ వనిత.. ఆమె జీవితం ఎలా మారిందో చూడండి!