New Ecs Appointment : కేంద్రానికి ఊరట.. కొత్త ఈసీల నియామకంపై జోక్యం చేసుకోలేమన్న సుప్రీం..!
TeluguStop.com
భారత అత్యున్నత న్యాయస్థానంలో కేంద్రానికి ఊరట లభించింది.కొత్త ఈసీల నియామకం( New Ecs Appointment ) వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు( Supreme Court ) తేల్చి చెప్పింది.
ఈ క్రమంలోనే కొత్త కమిషనర్ల నియామకంపై స్టే ఇవ్వలేమని ధర్మాసనం పేర్కొంది.అయితే కొత్త చట్టం ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామకం చేపట్టవద్దని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్( Association Of Democratic Reforms ) అనే సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని వెల్లడించింది.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్14, శనివారం 2024