లోతట్టు ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టాలి

సూర్యాపేట జిల్లా:గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల జలమయమైన లోతట్టు ప్రాంతాలలో అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సామాజిక ఉద్యమకారుడు కొల్లు వెంకటేశ్వరరావు ( Kollu Venkateswara Rao )డిమాండ్ చేశారు.

బుధవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఎగువ ప్రాంతాల నుండి దిగువ ప్రాంతాలకు వర్షపు నీరు చేరి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని చెప్పారు.

దాంతో ఈ ప్రాంతాలలో ఎక్కువగా నివసించే పేదల ఇండ్లు, గోడలు దెబ్బతిని వారి ప్రాణాలకు హాని కలిగే ప్రమాదం పొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసారు.

లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీరు అలాగే నిలిచి ఉంటే దోమలు పెరిగి అవి కుట్టడం వలన డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాలు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నదని చెప్పారు.

కనుక అధికారులు తక్షణమే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి సహాయక చర్యలను ముమ్మరం చేయాలని కోరారు.

పేకలతో అత్యంత ఎత్తైన ఇల్లు కట్టిన అమెరికన్ ఆర్కిటెక్ట్.. ప్రపంచ రికార్డు బద్దలు..