జనసేనకు ఏపీ హైకోర్టులో ఊరట..!

జనసేన పార్టీకి ఏపీ హైకోర్టు( AP High Court )లో ఊరట లభించింది.

ఈ మేరకు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది.

జనసేన పార్టీ( Janasena Party Symbol )కి గ్లాసు గుర్తు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఇటీవల పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం సుదీర్ఘ వాదనలు విన్న తరువాత తీర్పును రిజర్వ్ చేసింది.

దీనిపై తాజాగా తీర్పును వెలువరించిన హైకోర్టు జనసేనకు అనుకూలంగా తీర్పును వెల్లడించింది.

సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగు పూయొద్దు: పవన్ కళ్యాణ్