ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ఊరట..!
TeluguStop.com
టీడీపీ అధినేత చంద్రబాబు( TDP Leader Chandrababu Naidu )కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు( Inner Ring Road Case )లో చంద్రబాబు ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం పిటిషన్ ను కొట్టివేసింది.
"""/"/
హైకోర్టు( High Court ) అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే ఉత్తర్వులు ఇచ్చిందని ధర్మాసనం పేర్కొంది.
అలాగే కేసు దర్యాప్తుపై ముందస్తు బెయిల్( Anticipatory Bail ) ప్రభావం ఉండదని స్పష్టం చేసింది.
ఒకవేళ కేసు దర్యాప్తునకు చంద్రబాబు సహకరించని పక్షంలో బెయిల్ రద్దు చేసేందుకు పిటిషన్ దాఖలు చేయొచ్చని సుప్రీంకోర్టు వెల్లడించింది.
పొడి చర్మంతో చింతేలా.. ఈ సింపుల్ చిట్కాలతో రిపేర్ చేసేయండి!