కొత్త ఫ్యాషన్ బ్రాండ్ లాంచ్ చేసిన రిలయన్స్ రిటైల్.. డ్రెస్సులు తక్కువ ధరకే!
TeluguStop.com
ప్రముఖ సంస్థ రిలయన్స్ గ్రూప్‌నకు అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ రిటైల్ కంపెనీ దాదాపు అన్ని చోట్లా విస్తరించింది.
ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీ తన కొత్త ఫ్యాషన్ బ్రాండ్ 'యూస్టా ( Yousta )' మొదటి స్టోర్ ను హైదరాబాద్( Hyderabad ) లో గురువారం రోజు ప్రారంభించింది.
ఈ స్టోర్ లో యూత్ ని ఆకట్టుకునేలా దుస్తులు ఉంటాయట.అంతేకాకుండా ఆ ఫ్యాషన్ దుస్తులు అతితక్కువ ధరకే యూస్టా స్టోర్ లో లభిస్తాయని రిలయన్స్ రిటైల్ ఒక ప్రకటనలో తెలిపింది.
అన్ని డ్రెస్సులు రూ.999 నించకుండా ఎక్కువ శాతం ఉత్పత్తులు రూ.
499 కంటే తక్కువ ధరలోనే ఉంటాయని రిలయన్స్ రిటైల్ కంపెనీ తెలిపింది.అంతేకాకుండా ఈ స్టోర్‌లోకి క్యూఆర్ ఎనేబుల్డ్ స్క్రీన్స్, సొంత చెక్ ఔట్ కౌంటర్లు, కాంప్లిమెంటరీ వైఫై సౌకర్యాలు లాంటివి వినియోగదరులకు అందుబాటులో ఉన్నాయి.
పెరుగుతున్న యూత్ కి అనుగుణంగా ఫ్యాషన్ అవసరాలను తీర్చేందుకు యూస్టా ఒక మంచి ఎంపీకగా నిలుస్తుందని రిలయన్స్ రిటైల్ ఫ్యాషన్, లైఫ్ స్టైల్ సీఈఓ అఖిలేష్ ప్రకాష్ ప్రకటించారు.
"""/" /
అయితే రిలయన్స్ కొత్త ఫ్యాషన్ బ్రాండ్ యూస్టా కేవలం దుస్తుల కోసమే కాకుండా యూత్ కి కావాల్సిన ప్రత్యేకమైన స్టోర్లు గా నిలిపేందుకు పని చేస్తుంది.
ఈ క్రమంలోనే యూత్ తమ పాత దుస్తులను యూస్టా స్టోర్ లో విరాళం గా ఇవ్వొచ్చని చెప్పింది.
ఆ దుస్తులను కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ కోసం ఉపయోగించేందుకు అవకాశం కల్పిస్తుందని అఖిలేష్ ప్రకాష్ తెలిపారు.
15-25 సంవత్సరాల వయస్సు గల అమ్మాయిలు అబ్బాయిలు చిన్న పిల్లలందరికీ చవకైన ధరల్లో ఉత్తమ డ్రెస్సులు ఇందులో దొరుకుతాయి.
"""/" /
రిలయన్స్ రిటైల్( Reliance Retail ) 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 100 యూస్టా స్టోర్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కంపెనీ తన ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, అజియో, జియోమార్ట్ ద్వారా యూస్టా బ్రాండ్‌ను ఆన్లైన్లో విస్తరించాలని కూడా యోచిస్తోంది.
మొదలైన చైతన్య శోభిత పెళ్లి వేడుకలు… వైరల్ అవుతున్న హల్దీ ఫోటోలు!