ప్రతీ గ్రామానికి, ప్రతీ కాలువకు నీటిని విడుదల చేయండి: ఎమ్మెల్యే బిఎల్ఆర్

నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రతీ గ్రామానికి నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఎమ్మేల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆదేశించారు.

బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ ఎస్ఈ,డిఈ,ఏఈ మరియు ఇతర అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతీ గ్రామానికి,ప్రతీ ఎకరాకు నీటిని అందించాలన్నారు.

నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రతీ కాలువ విడుదల చేయాలని,అలాగే ఏదైనా కాలువాలు చెట్లు మొలచి,చెత్త అధికంగా ఉండి నీటి సరఫరా ఆగిపోతే వెంటనే అలాంటి కాలువలను గుర్తించి శుభ్రపరచాలని సూచించారు.

రైతులు ఎవ్వరూ ఇబ్బంది పడకుండా వారికి పూర్తి స్థాయిలో అధికారులు సహకరించాలన్నారు.

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జోర్దార్ సుజాత..ఇంత సీక్రెట్ గా ఉంచారే?