ఉద్యాన తోటలకు రూ.40.71 లక్షల రాయితీ విడుదల

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District )లో 2022-2023 ఆర్థిక సంవ్సరానికి సంబంధించి పామ్ ఆయిల్ తోట( Oil Palm Farming )లు పెట్టుకున్న రైతులకు 2023-24 ఆర్థిక సంవత్సరం లో 2 వ సంవత్సరం కింద రావలసిన రాయితీ ప్రభుత్వం నుండి విడుదలైనట్లు జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారిణి యం.

జ్యోతి తెలిపారు.292 మంది రైతులకు చెందిన 969 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలకు సంబంధించిన రాయితీలను ప్రభుత్వం విడుదలచేసింది అని చెప్పారు.

ఆయిల్ పామ్ రైతులకు అంతర పంటల సాగు కు, ఆయిల్ పామ్ తోటల యాజమాన్యం కోసం రూ" 2100 చొప్పున ఎకరాకు ఏడాదికి రూ" 4200 చొప్పున విడుదల అయ్యాయి.

మొత్తం జిల్లాలో రూ .40,71,270 /- విడుదల కావడం జరిగింది.

రాయితీ నిధులను జిల్లా లోని ఆయిల్ పామ్ రైతుల వ్యక్తిగత ఖాతా లలో జమచేయడం జరిగింది.

ఐదేళ్లలో జక్కన్న ఒక సినిమా తీస్తే ప్రభాస్ 5 సినిమాలు.. రాజమౌళి మారక తప్పదా?