శ్రీదేవితో అనిల్ కపూర్ సంబంధం గురించి జాన్వి ఏం చెప్పిందంటే

శ్రీదేవి కపూర్.ఇండియన్ సినిమా పరిశ్రమలో అతిలోక సుందరి.

ఆమె అందంతో పాటు నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.తెలుగులో ఆమె నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి.

ఇక ఈ అందాల తార దాదాపు అందరు టాప్ హీరోలతోనూ కలిసి నటించింది.

చిరంజీవి, శోభన్ బాబుతో కలిసి జనాలను బాగా అలరించింది.వీరి జోడీలు హిట్ ఫెయిర్ గా నిలిచాయి.

జాతీయ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న శ్రీదేవి.తెలుగు, తమిళ భాషల్లో బాగా సక్సెస్ అయ్యింది.

శ్రీదేవి నటించిన సినిమా రిలీజ్ అవుతుంది అంటే.హీరోలతో సంబంధం లేకుండా జనాలు థియేటర్లకు క్యూ కట్టేవారు.

సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో బాగా పాపులర్ అయిన తర్వాత బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.

దేశం గర్వించే అతిలోక సుందరిగా మారిపోయింది.తొలుత శ్రీదేవి కందన్ కరుణై అనే తమిళ సినిమాతో   కేరీర్ మొదలు పెట్టింది.

తొలి రోజుల్లో తమిళ, మలయాళ సినిమాలు ఎక్కవగా చేసింది.కమల్ హాసన్ తో కలిసి పలు హిట్ సినిమాల్లో నటించింది.

వీరి కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్ గా నిలిచింది. """/" / నిజానికి తను బతికి ఉండగానే తన కూతురును హీరోయిన్ గా చూడాలి అనుకుంది.

కానీ తన కోరిక తీరకుండానే చనిపోయింది.ఆమె చనిపోయిన తర్వాత జాన్వి దడ్ కన్ అనే సినిమా చేసి మెప్పించింది.

గ్లామర్ షోలో తల్లిని మించిపోయింది ఈ ముద్దుగుమ్మ.తాజాగా జాన్వీ ఓ విషయం చెప్పింది.

అమ్మ గురించి చెప్తూ తన బాబాయ్ అనిల్ కపూర్ గురించి కూడా వెళ్లడించింది.

అమ్మ బాబాయ్ ని కలిసిన ప్రతి సారి తన కాళ్లకు దండం పెట్టేదట.

తన ఫేవరెట్ స్టార్ అనిల్ కపూర్ అని చాలా సార్లు చెప్పిందట.అటు అనిల్, శ్రీదేవి కలిసి పలు హిట్ సినిమాల్లోనూ నటించింది శ్రీదేవి.

తన బాబాయ్ మా ఫ్యామిలీని ఎంతో బాగా చూసుకుంటారని చెప్పింది జాన్వీ.

కజకిస్థాన్‌ విమానం క్రాష్ తర్వాత లోపల ఏం జరిగిందంటే? వీడియో వైరల్