పౌర్ణమి ఫెయిల్యూర్ కి ప్రభుదేవా కు సంబంధం ఏంటి .. ?
TeluguStop.com
అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఏ గొడవా ఉండదు.ఏమాత్రం తేడా జరిగినా ఇబ్బందులు మొదలవుతాయి.
సినిమా ఇండస్ట్రీలోనూ ఇలాంటి ఘటనలు కామన్ గా జరుగుతాయి.అలాంటిదే ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయం.
ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చాడు.ఆ తరువాత ఎంతో కష్టపడి చేసిన రాఘవేంద్ర డిజాస్టర్ గా నిలిచింది.
ఆ సమయంలో ప్రభాస్ హీరోగా నిలదొక్కుకోవాలని ఎదురుచూస్తున్న సమయంలో మంచి విజయాన్ని అందించిన సినిమా వర్షం.
అయితే ఆ తరువాత అదే నిర్మాతతో చేసిన సినిమా డిజాస్టర్ కావడంతో దర్శకుడితో గొడవ జరిగినట్లు అప్పట్లో రూమర్స్ ఎన్నో వచ్చాయి.
తాజాగా వాటిపై క్లారిటీ వచ్చింది.ఆ రూమర్లపై వివరణ ఇచ్చిన నిర్మాత మరెవరో కాదు ఎమ్ఎస్.
రాజు.ఆయన కెరీర్ మొదట్లో తెరకెక్కించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర ట్రెండ్ సెట్ చేశాయి.
దేవి సినిమాతో పాటు ఒక్కడు బాక్సాఫీస్ దగ్గర భారీ స్థాయిలో వసూళ్లను అందుకున్నాయి.
ఆయనతో సినిమా చేయాలని అప్పట్లో బడా హీరోలు రెడీగా ఉండేవారు.సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ లో ఒక సినిమా వస్తోంది అంటే అప్పట్లో ప్రేక్షకులలో కూడా మంచి అంచనాలు ఉండేవి.
చిన్న సినిమా వచ్చినా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చేవి.మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా.
వంటి మ్యూజికల్ హిట్స్ కూడా మంచి గుర్తింపును అంధించాయి.అయితే వర్షం సినిమా సక్సెస్ అనంతరం ప్రభాస్.
ఎమ్ఎస్.రాజు ప్రొడక్షన్ లోనే మరొక సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు.
"""/"/ నువ్వొస్తానంటే నేనొద్దంటానా హిట్టవ్వడంతో ఆ సినిమా దర్శకుడు ప్రభుదేవా కాంబినేషన్ లోనే మరొక సినిమా చేయాలని పౌర్ణమితో ముందుకు వెళ్లారు.
అప్పట్లో ఛత్రపతి హిట్ అయిన తరువాత చేసిన సినిమా కావడంతో పౌర్ణమిపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి.
అంచనాలకు తగ్గట్లుగానే నిర్మాత భారీ బడ్జెట్ తో నిర్మించారు.కానీ సినిమా ఫ్లాప్ అయ్యింది.
సినిమా మేకింగ్ విషయంలో నిర్మాత రాజు, డైరెక్టర్ ప్రభుదేవా మధ్య గొడవ అయినట్లు అప్పట్లో రూమర్స్ బాగానే వచ్చాయి.
తాజాగా రూమర్స్ కు చెక్ పెట్టాడు నిర్మాత.నిజంగా ప్రభుదేవాకు తనకు మధ్య ఎలాంటి గొడవ జరగలేదని చెప్పారు.
అవి కేవలం పుకార్లేనని తేల్చి చెప్పారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి14, మంగళవారం2025