కస్తూరి, ఆమని ల మధ్య ఉన్న బంధం ఏంటో తెలుసా.. ?

కస్తూరి, ఆమని ల మధ్య ఉన్న బంధం ఏంటో తెలుసా ?

ఆమని, కస్తూరి.ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమను ఏలిన ఈ ఇద్దరు నటీమణులు ప్రస్తుతం బుల్లి తెరపై తెగ సందడి చేస్తున్నారు.

కస్తూరి, ఆమని ల మధ్య ఉన్న బంధం ఏంటో తెలుసా ?

గృహాలక్ష్మి సీరియల్ లో తులసి క్యారెక్టర్ చేస్తూ జనాల నుంచి మంచి క్రేజ్ సంపాదించుకుంది కస్తూరి.

కస్తూరి, ఆమని ల మధ్య ఉన్న బంధం ఏంటో తెలుసా ?

అంతేకాదు.బుల్లి తెరపై తన నటకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజిలో ఉంది.

ఈ సీరియల్ కాన్సెప్ట్ ఓ రేంజిలో ఉండటంతో జనాలు కూడా విపరీతంగా చూస్తున్నారు.

టీవీ సీరియల్స్ లో ఈ సీరియల్ టాప్ టీఆర్పీతో దూసుకుపోతుంది.అటు సీరియల్స్ లోకి రాకముందు కస్తూరి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగుతో పాటు తమిళ సినిమా పరిశ్రమల్లోనూ టాప్ హీరోయిన్ గా కొనసాగింది.అటు ఆమని సైతం తెలుగు సినిమా పరిశ్రమలో మంచి నటీమణిగా గుర్తింపు తెచ్చుకుంది.

ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన జంబలకడిపంబ సినిమాతో ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత పలు హిట్ మూవీస్ చేసింది.తన అందంతో పాటు అభినయంతో జనాలను విపరీతంగా ఆకట్టుకుంది.

మిస్టర్ పెళ్లాం సినిమాలో నటనకు గాను జాతీయ అవార్డు అందుకుంది.ఉత్తమ నటిగా నంది అవార్డును సైతం దక్కించుకుంది.

పెళ్లి తర్వాత ఆమె సినిమాల నుంచి దూరం జరిగింది.2003 తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.

పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతోంది. """/"/ అయితే తాజాగా కస్తూరి, ఆమనికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

వీరిద్దరు కలిసి దిగిన ఫోటోను కస్తూరి ఈ మధ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఈ ఫోటో చూసి ఇద్దరు నటీమణుల ఫ్యాన్స్ బాగా ఖుషీ అవుతున్నారు.అన్నమయ్య సినిమాలో కస్తూరి నటన అంటే ఆమనికి చాలా ఇష్టమట.

అసలు కస్తూరితో స్నేహం కలగడానికి కారణమే అన్నమయ్య సినిమా అంటుంది ఆమని.ఈ సినిమా వచ్చినప్పటి నుంచి తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పింది.

అప్పటి నుంచి ఈ ఇద్దరు తారామణులు తరుచుగా కలుసుకుంటూ ఉంటారట.పలు విషయాల గురించి మాట్లాడుకుంటారట.

అటు తాజాగా ఆమని కూడా బుల్లితెర మీదికి అడుగు పెట్టింది.పలు సీరియల్స్ లో నటిస్తూ జనాలను ఆకట్టుకుంటుంది.