Ramyakrishnan: పెళ్లికి ముందే సహజీవనం.. అందుకే రమ్యకృష్ణ కాపురంలో గొడవలా..?
TeluguStop.com
భలే మిత్రులు ( Bhale Mitrulu ) అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రమ్యకృష్ణ ( Ramyakrishnan ) సూత్రధారులు అనే సినిమాతో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.
అయితే ఒకప్పుడు ఈ హీరోయిన్ నటించిన ప్రతి సినిమా ప్లాఫ్ అవుతుంది అని, ఆమె ఓ ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది.
కానీ ఎప్పుడైతే అల్లుడుగారు ( Alludu Garu ) అనే సినిమాలో హీరోయిన్ గా చేసిందో అప్పటినుండి ఈ హీరోయిన్ దశ తిరిగిందని చెప్పవచ్చు.
దాంతో ఇండస్ట్రీలో ఉన్న దాదాపు స్టార్ హీరోలందరితో కలిసి జతకట్టింది.రమ్యకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు మూడు దశాబ్దాలు పూర్తయిన కూడా ఇప్పటికీ వరుస చాన్స్ లతో బిజీగా ఉంటుంది.
"""/" /
అయితే రమ్యకృష్ణ డైరెక్టర్ కృష్ణవంశీ ( Krishnavamshi ) ని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
కానీ పెళ్లి కాకముందే ఆయనతో సహజీవనం చేయడం వల్ల రమ్యకృష్ణ కృష్ణవంశీ మధ్య పెళ్లయ్యాక గొడవలు వచ్చాయి అంటూ తాజాగా ఒక వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.
ఇక అసలు విషయం ఏమిటంటే.పెళ్లి కాక ముందు రమ్యకృష్ణ సహజనం చేసిన వ్యక్తి అంటే అందరూ ఇంకెవరు అనుకునేరు.
ఆయన ఎవరో కాదు తన భర్త కృష్ణ వంశీనే.కృష్ణవంశీ రమ్య కృష్ణ ( Ramyakrishnan ) ప్రేమించుకొని పెళ్లికి ముందే రిలేషన్ లో ఉన్నారట.
కానీ పెళ్లి కోసం కొన్ని రోజులు టైం తీసుకోవాలని సినిమాల్లో అవకాశాలు రావడంతో పెళ్లికి దూరంగా ఉన్నారట.
కానీ వీరి మధ్య ఉండే రిలేషన్ ఆ నోటా ఈ నోటా బయటపడడంతో చివరికి అది రమ్య కృష్ణ తల్లిదండ్రుల వరకు వెళ్ళింది.
అలా రమ్యకృష్ణ తల్లిదండ్రులు ఆమెకు వేరే వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేయాలని ఇబ్బంది పెట్టారట.
"""/" /
కానీ రమ్యకృష్ణ మాత్రం కృష్ణవంశీనే చేసుకుంటానని పట్టుబట్టి కూర్చొని ఇంట్లో నుండి బయటకు వచ్చేసి కృష్ణవంశీని హడావిడిగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది.
ఇక పెళ్లయ్యాక కూడా సినిమాల్లో నటించింది కానీ కొడుకు పుట్టాక కొన్ని రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉంది రమ్యకృష్ణ.
అయితే పెళ్లికి ముందే వీరిద్దరూ సహజనం చేసినప్పుడు ఇద్దరి మధ్య చాలా గొడవలు తలెత్తేవట.
దాంతో వీరి జంటను చూసిన చాలామంది ఇండస్ట్రీ జనాలు పెళ్లి చేసుకుంటే వీళ్ళేం కలిసి ఉండగలరు.
పెళ్లి చేసుకుంటే సంవత్సరానికే విడిపోవడం ఖాయం అని అనుకునే వారట.కానీ రమ్య కృష్ణ కృష్ణవంశీ ( Ramyakrishnan-Krisna Vamshi )) ఎన్ని గొడవలు పెట్టుకున్నా సరే మళ్ళీ కలిసిపోయేవారట.
అలా వీరి బంధం దాదాపు 20 ఏళ్ల పాటు కొనసాగుతోంది.ఇక ఎవరైతే వీళ్ళు విడిపోతారు అని అనుకున్నారో వాళ్లే ఇప్పుడు వీరిని చూస్తూ అన్యోన్య జంట అంటూ పొగుడుతున్నారు.
రాజకీయాలలో బిజీబిజీగా పవన్… ఆ బాధ్యతలు తీసుకున్న చరణ్ ,చిరు!