మల్లు మీనన్ నే కాదు మమ్మల్ని కూడా దయచూడండి.. త్రివిక్రమ్ కు షాకిస్తూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇతర భాషలకు చెందిన హీరోయిన్లు వరుస ఆఫర్లతో సత్తా చాటుతుండగా తెలుగమ్మాయిలకు మాత్రం ఎక్కువగా ఆఫర్లు రావడం లేదు.

కొంతమంది తెలుగమ్మాయిలు సినిమాల్లో సక్సెస్ సాధించినా ఎక్కువ సంవత్సరాల పాటు హీరోయిన్లుగా కెరీర్ ను కొనసాగించే విషయంలో వాళ్లు ఫెయిల్ అయ్యారనే సంగతి తెలిసిందే.

అయితే తాజాగా రేఖా భోజ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమాలలో సంయుక్త మీనన్ కు సినిమా ఆఫర్లు వచ్చేలా తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు.

భీమ్లా నాయక్ సినిమాలో నిత్యామీనన్ కు ఛాన్స్ దక్కడానికి త్రివిక్రమ్ కారణమనే సంగతి తెలిసిందే.

అయితే మల్లూ మీనన్లకు మాత్రమే కాకుండా తమకు కూడా సినిమా ఆఫర్లు ఇవ్వాలని రేఖా భోజ్ కోరారు.

"""/"/ తెలుగమ్మాయిలకు, టాలెంట్ ఉన్న తనలాంటి అమ్మాయిలకు త్రివిక్రమ్ ఛాన్స్ ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

రేఖా భోజ్ పోస్ట్ కు నెటిజన్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.త్రివిక్రమ్ కు షాకిచ్చేలా రేఖా భోజ్ పోస్ట్ పెట్టడం గమనార్హం.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సైతం టాలెంట్ ఉన్న తెలుగమ్మాయిలకు హీరోయిన్ ఛాన్స్ వచ్చేలా చేస్తే మంచిదని చెప్పవచ్చు.

"""/"/ తాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావాలని అనుకోలేదని హీరోయిన్ గా మాత్రమే కెరీర్ కు కొనసాగించాలని భావిస్తున్నానని రేఖా భోజ్ చెప్పుకొచ్చారు.

రేఖా భోజ్ కు ఫ్యాన్స్ సపోర్ట్ కూడా ఎక్కువగానే ఉంది.రాబోయే రోజుల్లో ఆమె హీరోయిన్ గా ఊహించని రేంజ్ లో సక్సెస్ అవుతారేమో చూడాల్సి ఉంది.

నటి రేఖా భోజ్ ఆవేదనను టాలీవుడ్ డైరెక్టర్లు అర్థం చేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది.

టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్.. గాయంతో జస్ప్రీత్ బుమ్రా అవుట్?