నామినేషన్ తిరస్కరణ.. కానీ మునుగోడు బ‌రిలో కేఏ పాల్‌..!

మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను అధికారులు పరిశీలించారు.

ఈ నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా లేని నామినేషన్లను అధికారులు తిరస్కరించారు.వాటిలో ప్రజాశాంతి పార్టీ అధినేత హోదాలో కేఏ పాల్ దాఖలు చేసిన నామినేషన్ కూడా ఉంది.

అయితే ఆయన బరిలోనే ఉన్నారని అధికారులు ప్రకటించారు.నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కేఏ పాల్ రెండు సెట్ల నామినేషన్లను వేశారు.

వాటిలో ఒకటి పార్టీ అధ్యక్షుడి హోదాలో దాఖలు చేయగా.మరొకటి ఇండిపెండెంట్ అభ్యర్థిగా దాఖలు చేశారు.

ప్రజాశాంతి పార్టీని గుర్తింపు లేని పార్టీగా ఇటీవ‌లే కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే.

దీంతో ప్ర‌జాశాంతి పార్టీ అధ్యక్షుడి హోదాలో దాఖలు చేసిన నామినేష‌న్‌ను తిర‌స్క‌రణకు గురైంది.

సంక్రాంతి కి వస్తున్నాం మూవీ ట్రైలర్ వచ్చేది అప్పుడేనా..?