Inner Ring Road Case :ఐఆర్ఆర్ కేసులో సీఐడీ ఛార్జిషీట్ తిరస్కరణ..!

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుపై విజయవాడలోని ఏసీబీ కోర్టు ( ACB Court )విచారణ జరిపింది.

ఇందులో భాగంగా సీఐడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది.

అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం అనుమతి లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

"""/" / కాగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో( Inner Ring Road ) నిన్న ఏపీ సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేశ్, రాజశేఖర్, నారా లోకేశ్ ను సీఐడీ నిందితులుగా పేర్కొంది.

సీఐడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ను విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించింది.

షాకింగ్ వీడియో: ఏడేళ్ల బాలుడిని ఢీ కొట్టిన బైకర్.. రోడ్డు దాటుతుండగా ప్రమాదం..