వామ్మో.. అనుష్క ఇన్ని పాత్రలు రిజెక్ట్ చేసిందా.. చేసి ఉంటే మరోలా ఉండేది?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఒక టాక్ వైరల్ గా మారి పోతూ ఉంటుంది.

ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమాని మరో హీరో చేసి ఇక మంచి విజయాన్ని అందుకుంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అని వార్తలు వినిపిస్తుంటాయ్.

కేవలం హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు సైతం ఇలా డేట్స్ అడ్జెస్ట్ కాక లేదా ఇతర కారణాలతో వదులుకున్న పాత్రలను వేరే వాళ్ళు చేసి బాగా గుర్తింపు సంపాదించుకుంటూ ఉంటారు.

ఇలా అనుష్క వదిలేసిన ఎన్నో పాత్రలు బాగా పాపులారిటీ సంపాదించినవి చాలానే ఉన్నాయి.

ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.సూపర్ స్టార్ రజనీకాంత్ దీపికా పదుకొనే జంటగా నటించిన సినిమా కొచ్చాడియన్.

అయితే ఈ సినిమాలో ముందుగా దీపికాపదుకునే కు బదులు అనుష్క ని అనుకున్నారట.

కానీ కొన్ని కారణాల వల్ల స్వీటీ ఈ పాత్రను చేయలేకపోయిందట.ఇక విక్రమ్ హీరోగా వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమా అవకాశం కూడా ముందుగా అనుష్క తలుపుతట్టింది.

కానీ ఎందుకో ఈ పాత్ర అనుష్కకు నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసిందట.ఇక అప్పట్లో ప్రభాస్ జోడికి మంచి క్రేజ్ ఉండేది.

దీంతో ప్రభాస్ హీరోగా వచ్చిన రెబల్ లో తమన్నా నటించిన పాత్ర కోసం ముందుగా అనుష్కని సంప్రదించారట.

ఇక స్వీటీ స్వీట్ గా రిజెక్ట్ చేసేసరికి ఆ ఆఫర్ కాస్త మిల్కీబ్యూటీకి వెళ్ళిపోయింది.

ఇక మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో వచ్చిన దొంగాట సినిమా ఆఫర్ కూడా ముందుగా అనుష్క దగ్గరికి వచ్చిందట.

"""/"/ పాత్రను రిజక్ట్ చేయడంతో చివరికి మంచు లక్ష్మి ని వరించింది.

అయితే ఇక కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన అరుంధతి బ్లాక్ బస్టర్ హిట్.

అయితే ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని అనుకున్నాడట కోడిరామకృష్ణ.కానీ అనుష్క ఒప్పుకోకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందట.

ఇక లారెన్స్ డైరెక్ట్ చేసిన కాంచన మూవీ కోసం నాగార్జున అనుష్క లను అనుకున్నారట.

ఇక ముందుగా నాగార్జున ఒప్పుకోకపోవడంతో తర్వాత అనుష్క కూడా ఈ పాత్రను రిజెక్ట్ చేసిందట.

ఇక అక్కినేని ఫ్యామిలీ మూవీ మనంలో ఛాన్స్ వచ్చినా ఆ సమయంలో ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో చివరికి రిజెక్ట్ చేసిందట అనుష్క.

"""/"/ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఆచార్య సినిమాలో కాజల్ కి బదులుగా అనుష్కని అనుకున్నారట.

కానీ ఎందుకో అనుష్క నో చెప్పడం తో కాజల్ ని ఫిక్స్ చేశారు.

వెంకటేష్ హీరోగా వచ్చిన నారప్ప సినిమాలో ప్రియమణి పాత్ర కోసం అనుష్క ని తీసుకోవాలి అనుకున్నారట.

కానీ స్వీటీ మాత్రం రిజెక్ట్ చేసిందట.ఇలా అనుష్క కెరీర్లో ఎన్నో మంచి పాత్రలు వదులుకుంది.

ఒకవేళ ఇవి కూడా చేసి ఉంటే అనుష్క ఒక రేంజ్ లో క్రేజ్ సంపాదించేది ఏమో అని అభిమానులు అంటున్నారు.

లాంగ్ అండ్ స్మూత్ హెయిర్ కోసం ఈ ఫ్రూట్ మాస్క్ ను తప్పక ట్రై చేయండి!