ఓటర్ అత్యుత్సాహం కేసు నమోదు

నల్లగొండ జిల్లా:ఎన్నికల నిబంధనలను అతిక్రమించి ఓటు వేసిన దృశ్యాన్ని ఫోన్లో చిత్రీకరించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు వేములపల్లి ఎస్ఐ డి.

విజయ్ కుమార్ తెలిపారు.ఎస్ఐ వెల్లడించిన వివరాల ప్రకారం.

గురువారం నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలోని పోలింగ్ బూత్ లో ఓటు వేసేందుకు వెళ్ళిన బంటు శ్రీనివాస్(ఓటర్ లిస్ట్ సీరియల్ నెంబర్ 911) ఓటు వేసిన దృశ్యాన్ని ఫోన్లో ఫోటోలు తీశారు.

అనుమానం వచ్చిన ప్రోసిడింగ్ అధికారి వేమారెడ్డి అక్కడికి వెళ్లి అతని ఫోను తీసుకొని పరిశీలించగా,అతని ఫోన్ లో ఓటు వేస్తూ తీసిన ఫోటోలు కనిపించడంతో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు బంటు శ్రీనివాస్ ను,అతని మొబైల్ ఫోన్ ను పోలీసులకు అప్పగించారు.

ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఇదే విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ఎన్నికల నిబంధనను ఉల్లంఘించిన బంటు శ్రీనివాస్ పై కేసు నమోదు చేశారు.

పూరీ జగన్నాథ్, అలీలకు 2025 కలిసొస్తుందా.. వీళ్లు పూర్వ వైభవం సాధిస్తారా?