సరదాగా గేమ్ ఆది సీరియస్ గా విన్నర్ అయిన రెజీనా

సౌత్ ఇండియన్ హాట్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రెజినా కసాండ్రా.

తమిళ్ పొన్ను అయిన ఈ భామ తెలుగులో ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ టైంలోనే మంచి ఫేం సొంతం చేసుకుంది.

కుర్ర హీరోలకి జోడీగా వరుస అవకాశాలు సొంతం చేసుకుంది.దీంతో రెజినా స్టార్ హీరోయిన్ అయిపోతుందని అందరూ భావించారు.

ఇటు నటన, అటు గ్లామర్ తో మెప్పించే ఈ అమ్మడుకి టాలీవుడ్ దర్శక, నిర్మాతలు కూడా భాగానే అవకాశాలు ఇచ్చారు.

అయితే ఎందుకనో ఈ భామకి క్రమంగా అవకాశాలు తగ్గిపోయాయి.దీంతో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో సెవెన్ సినిమాలో నటించింది.

ఈ సినిమాలో ఆమె విలనీగా తన పెర్ఫార్మెన్స్ తో ఆధారగొట్టింది.అయితే ఆ సినిమా ఫ్లాప్ అవడంతో పెద్దగా గుర్తింపు రాలేదు.

తరువాత అడవి శేష్ తో కలిసి ఎవరు అనే సినిమాలో నటించింది.థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో కూడా ఆమె నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది.

ఈ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకొని రెజినాకి పెర్ఫార్మెన్స్ కి కూడా ప్రశంసలు లభించాయి.

అయితే అవకాశాలు మాత్రం రాలేదు.రీసెంట్ గా విశాల్ చక్ర సినిమాలో కూడా నెగిటివ్ రోల్ లో ఆధారగొట్టింది.

సినిమా ఎవరేజ్ గా ఆడటంతో ఆమె గురించి మాట్లాడేవారే లేకుండా పోయారు.ప్రస్తుతం మాతృబాషలో ఒకటి, రెండు, తెలుగులో ఆచార్య సినిమాలో ప్రత్యేక గీతంలో ఆమె నటిస్తుంది.

ఆమె న‌టిస్తున్న ఓ సినిమా షూటింగ్ వాయిదా ప‌డ‌డం వ‌ల‌న తాజాగా ఓ వాట‌ర్ స్పోర్ట్స్ గేమ్‌ రేస్‌లో పాల్గొని ప్రైజ్ గెలుచుకుంది.

ఈ విష‌యాన్ని త‌న ఇన్‌స్టా వేదిక‌గా తెలిపింది రెజీనా.ఈ ఆదివారం నాడు చెన్నైలో స్టాండ‌ప్ ప‌డిల్ రేసులో పాల్గొన్నా.

నిజానికి ఆరోజు నేను చెన్నైలో ఉండాల్సింది కాదు.తాను న‌టిస్తున్న సినిమా షూటింగ్ వాయిదా ప‌డ‌డం వ‌ల‌న ఇంటికి వ‌చ్చాను.

దీంతో ఏదో స‌ర‌దాగా నా ఫ్రెండ్స్‌తో ఈ ఆట‌లో పాల్గొన్నాను.మొత్తానికి రేస్‌లో విన్న‌ర్‌గా నిలిచాను అంటూ రాసుకొచ్చింది రెజీనా.

నన్ను వెంటాడే ఎమోషన్ నువ్వు… ఆసక్తికర పోస్ట్ చేసిన ఎన్టీఆర్!