ఆ పాత్రలో నటిస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా.. రెజీనా కసాండ్రా!

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో వివిధ భాషలలో ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి రెజీనా కసాండ్రా ఒకరు.

ఎన్నో అద్భుతమైన చిత్రాలలో హీరోయిన్ గా నటించడమే కాకుండా నెగిటివ్ పాత్రల ద్వారా కూడా అందరినీ మెప్పించి తాజాగా కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన ఆచార్య సినిమాలో కూడా ప్రత్యేక పాత్ర ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైంది.

ఇలా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రెజీనా బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.

ఈ క్రమంలో ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో ‘ఏక్ లడకీకో దేఖాతో ఐసా లగా’ చిత్రంలో లెస్బియన్‌గా నటించడమే కాకుండా ‘రాకెట్ బాయ్స్’ అనే వెబ్ సిరీస్ ద్వారా కూడా బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

విక్రమ్ సారాభాయ్ హోమీ బాబా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 4వ తేదీన సోనీలివ్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఇక ఈ వెబ్ సిరీస్ లో రెజీనా విక్రమ్ సారాభాయ్ భార్య మృణాళిని సారాభాయ్ పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

"""/"/ అభయ్ పన్ను దర్శకత్వంలో మోనీషా అద్వానీ, మధు భోజ్వానీసంయుక్తంగా నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో మృణాళినీ సారభాయ్ పాత్రలో నటించడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని తెలిపారు.

మృణాళిని విక్రమ్ సారాభాయ్ భార్యగా మాత్రమే కాకుండా ఒక అద్భుతమైన క్లాసికల్ డాన్సర్ గా, కొరియోగ్రాఫర్ గా తనకున్న కలలతో ఎంతో అద్భుతంగా జీవించింది.

అలాంటి గొప్ప వ్యక్తి పాత్రలో నటించడం తన అదృష్టం అని వెబ్ సిరీస్ లో తన పాత్ర చాలా తక్కువగా ఉన్నా.

అంత గొప్ప వ్యక్తి పాత్రలో నటించడం నిజంగా తన అదృష్టమని రెజీనా తెలిపారు.

AP BJP : ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో ట్విస్టులివే.. ఈ అభ్యర్థులకు గెలుపు సులువు కాదంటూ?