దసరా కానుకగా రెజీనా, నివేథా శాకినీ డాకినీ
TeluguStop.com
ఈ మధ్య కాలంలో సౌత్ బాషలలో కూడా ఫిమేల్ సెంట్రిక్ కథలకి ప్రాధాన్యత పెరుగుతుంది.
నయనతార ఇప్పటికే కోలీవుడ్ లో సోలోగా సక్సెస్ లు కొడుతూ సూపర్ స్టార్ అయిపొయింది.
అనుష్క, త్రిష, సమంత కూడా సోలోగానే సక్సెస్ లు కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు.
ఆ దిశగానే వారి కథల ఎంపిక కూడా ఉంటుంది.ఇదే దారిలో మేము కూడా సోలోగా ప్రూవ్ చేసుకుంటామని యంగ్ బ్యూటీస్ రెజీనా కసాండ్రా, నివేథా థామస్ అంటున్నారు.
సురేష్ ప్రొడక్షన్ లో సుదీర్ భాబు దర్శకత్వంలో వీరిద్దరి శాకినీ డాకినీ అనే సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతుంది.కొరియన్ మూవీ మిడ్ నైట్ రన్నర్స్ అఫీషియల్ రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కుటుంది.
అయితే కొరియన్ లో హీరోలతో ఉండే ఈ కథని ఫిమేల్ సెంట్రిక్ గా మార్చి తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
మెయిన్ ఎలిమెంట్స్ అలాగే వచ్చి స్క్రీన్ ప్లే ని మాత్రం కొత్తగా చెప్పే ప్రయత్నం సుదీర్ బాబు చేస్తున్నాడు.
థ్రిల్లర్ కథాంశంగా ఈ మూవీ ఉండబోతుంది.ఇక ఈ మూవీలో షూటింగ్ ని వీలైనంత వేగంగా కంప్లీట్ చేసి దసరాకి ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని సురేష్ బాబు భావిస్తున్నారు.
సరికొత్త పాయింట్ తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో కచ్చితంగా ఆడియన్స్ ని కనెక్ట్ అవుతుందని భావిస్తున్నారు.
నివేథా థామస్ ని మంచి టాలెంటెడ్ యాక్టర్ గా ఇప్పటికే గుర్తింపు ఉంది.
అలాగే రెజీనా కూడా నటిగా ప్రూవ్ చేసుకుంది.ఇప్పుడు వీరిద్దరిని కలిపి తెరపై సుదీర్ బాబు శాకినీడాకిని మూవీని ఆవిష్కరిస్తున్నాడు.
మరి తెలుగు ప్రేక్షకులు ఈ మూవీకి ఎంత వరకు కనెక్ట్ అవుతారో చూడాలి.
ఇదేం రోటీ రా బాబు.. దుప్పటి సైజులో ఉందేంటి.. పాకిస్థానీ వ్యక్తి వీడియో వైరల్!