జర్మన్ మహిళలను వణికిస్తున్న తహర్రష్, ఇదో వికృత క్రీడ

డ్రాగన్ దేశం అయిన చైనా ను గత కొంత కాలంగా కరోనా వైరస్ వణికిస్తున్న విషయం తెలిసిందే.

అయితే జర్మనీ లో ప్రత్యేకంగా మహిళలను వణికిస్తుంది తహర్రష్.ఇదేదో కరోనా లాగా వైరస్ అనుకుంటే పొరపాటే, ఇది అక్కడ మహిళలపై జరుగుతున్న ఒక వికృత క్రీడ.

జర్మనీ లో అరబ్,ఆఫ్రికా శరణార్ధుల అరాచకాలతో అక్కడ మహిళలపై వికృత లైంగిక దాడులు చోటుచేసుకుంటున్నాయి.

20 నుంచి 30 మానవ మృగాలు రోడ్లపై బృందాలుగా తిరుగుతూ అందమైన ఆడపిల్ల కనిపించగానే వెంటనే మీద పడిపోయి తమ వికృత క్రీడ మొదలు పెడతారు.

ఒంటరిగా ఉన్న మహిళలపై ఈ మృగాలు రెచ్చిపోయి ప్రవర్తిస్తారు.గుంపులుగా వచ్చి నడిరోడ్డుపైనే ఈ తహర్రష్ పేరుతో లైంగిక దాడులకు పాల్పడుతుంటారు.

2005 నుంచి ఈజిప్ట్ లో బాగా పాపులర్ అయిన ఈ తహర్రష్ వికృత క్రీడ 2012 లో బాహ్య ప్రపంచానికి తెలిసింది.

అయితే ఈ క్రీడ పేరుతో మహిళలపై వికృతంగా దాడికి దిగుతారు.వారి శరీరం మొత్తం తాకుతూ, గాయపరుస్తూ పైశాచిక ఆనందం పొందుతూ ఉంటారు.

"""/"/అరబ్,ఆఫ్రికా నుంచి వచ్చిన శరణార్థులే ఇప్పుడు జర్మనీ మహిళలకు విలన్ లుగా మారారు.

వారి పైశాచిక ఆనందానికి కొందరు గాయాలతో బయటపడుతుండగా మరికొందరు సామూహిక అత్యాచారాలకు బలైపోతున్నారు.

అయితే 2012 లో ఈ వికృత క్రీడ గురించి తెలిసినప్పటికీ జర్మనీ లో మాత్రం ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకల్లోనే ఈ తహర్రష్ కు బీజం పడినట్లు తెలుస్తుంది.

కొలోన్ లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న అమ్మాయిలను టార్గెట్ గా చేసుకొని దాదాపు 500 మంది కుర్రాళ్ళు వేధింపులకు గురి చేశారు.

ఇలా వారి పైశాచిక క్రీడ దాదాపు గంటపాటు కొనసాగుతుంది.దీనికి సంబంధించి 516 కేసులు నమోదు అయినట్లు తెలుస్తుంది.

అయితే ఈ పరిణామాలతో జర్మన్ యువత అంతా మండిపోతుంది.ఛాన్స్ లర్ పై తీవ్ర స్థాయిలో వారు మండిపడుతున్నారు.

శరణార్ధుల కారణంగా మునుపటి జీవితం గడపలేకపోతున్నాం అని యువత గగ్గోలు పెడుతుంది.కొలోన్ లో జరిగిన పైశాచిక దాడిలో 30 మందిని అరెస్ట్ చేయగా వారిలో 15 మంది ఇటీవలే జర్మనీ కి వలస వచ్చిన వారుగా అధికారులు గుర్తించారు.

అయితే ఇలాంటి విషయాలు బయటకు వస్తే శరణార్థులపై వ్యతిరేకత పెరిగి పలు అల్లర్లు చోటుచేసుకుంటాయి అన్న ఉద్దేశ్యం తో ఆ దేశం కూడా ఈ విషయం పై మిన్నకున్నట్లు తెలుస్తుంది.

అయితే యువత మాత్రం ఈ వేధింపులు తట్టుకోలేకపోతున్నారు.దీనిపై నిర్ణయం తీసుకోవాలి అంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో 16 మంది క్రీడాకారుల దుర్మరణం.. కెనడాలో భారతీయ ట్రక్క్ డ్రైవర్‌కు దేశ బహిష్కరణ