సంస్కరణల సాధకుడు మన్మోహన్ సింగ్: ఎమ్మేల్యే వేముల వీరేశం

నల్లగొండ జిల్లా:భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం చాలా బాధాకరమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.

శుక్రవారం నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని మెయిన్ సెంటర్ నందు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ఎమ్మేల్యే మాట్లాడుతూ భారతదేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశంలోని అత్యంత కీలకమైన నేతల్లో ఒకరని పేర్కొన్నారు.

ఆర్థిక శాస్త్రవేత్తగా ప్రస్థానం ప్రారంభించిన,ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ ఆర్థిక వ్యూహాన్ని మారుస్తూ దేశాన్ని గ్లోబల్ మార్కెట్లోకి చేర్చడంలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు.

2004 నుంచి 2014 వరకు 2 సార్లు భారత ప్రధాన మంత్రిగా విశిష్ట సేవలు అందించారని తెలిపారు.

ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలోనూ ఆయన ఆర్థిక నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టాయన్నారు.

అలాంటి మహనీయున్ని దేశం కోల్పోయిందన్నారు.ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని దేవుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ రజిత,మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్,మాధవరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నకిరేకంటి ఏసుపాదం, పన్నాల రాఘవరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు లింగాల వెంకన్న,వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

మాజీ లవర్‌ను తిరిగి కలిపే మంత్ర తంత్రాలు.. సింగపూర్‌లో ఆ ఆచారాలకు ఫుల్ డిమాండ్!