హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తగ్గిన ఓటింగ్..!!

శనివారం హిమాచల్ ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సజావుగా సాగాయి.మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు 412 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.

66.58 శాతం పోలింగ్ నమోదయింది.

అయితే గతంలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే బాగా తగ్గినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.

ఉదయం ఎనిమిది గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.అయితే మంచు మరియు చలి కారణంగా మధ్యాహ్నం వరకు.

ఓటింగ్ అంతగా నమోదు కాలేదు.మధ్యాహ్నం తర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చింది.

అత్యధికంగా సిర్ మౌర్ జిల్లాలో, అతి తక్కువగా లాహాల్, స్పితి జిల్లాలో పోలింగ్ నమోదు అయినట్లు పోలింగ్ అధికారులు తెలియజేశారు.

"""/" /   ఈ క్రమంలో రాష్ట్రంలో 80 ఏళ్లు పైబడిన ఓటర్ లు 38 వేల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు స్పష్టం చేశారు.

ఈ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పోటీ నెలకొంది.

తమదే గెలుపు అంటూ మూడు పార్టీలకు చెందిన నాయకుల ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి బట్టి ఖచ్చితంగా రెండోసారి అధికారంలోకి వస్తామని బీజేపీ బలంగా నమ్ముతుంది.

లేదు ఈసారి తమదే విజయమని కాంగ్రెస్ అంటుంది.మరోపక్క  ఆమ్ ఆధ్మి  పార్టీ కూడా గెలుపు పై ధీమాగా ఉంది.

మరి ఈ మూడు పార్టీలలో ఎవరు గెలుస్తారో.అనేది డిసెంబర్ 8న రానున్న ఫలితాలలో తేలనుంది.

షెల్టర్ హోమ్ నుంచి బాలికను అపహరించిన ఆరుగురు వ్యక్తులు.. వీడియో వైరల్..