నాగార్జున‌సాగ‌ర్ ప్రాజెక్టుకు త‌గ్గిన వ‌ర‌ద ప్ర‌వాహం

న‌ల్గొండ జిల్లాలోని నాగార్జున‌సాగ‌ర్ ప్రాజెక్టుకు వ‌ర‌ద ప్ర‌వాహం త‌గ్గుముఖం ప‌ట్టింది.ఎగువ‌న ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా వ‌ర‌ద రాక త‌గ్గ‌డంతో 7 క్ర‌స్ట్ గేట్ల‌ను ప‌ది అడుగుల మేర ఎత్తి ల‌క్షా 94 వేల 932 క్యూసెక్కుల నీటిని విడుద‌ల చేస్తున్నారు.

అదేవిధంగా రెండు జ‌ల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ను ఉత్ప‌త్తి చేయ‌డం ద్వారా 63,477 క్యూసెక్కుల నీటిని వ‌దులుతున్నారు.

సాగ‌ర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమ‌ట్టం 590 అడుగులు కాగా, ప్ర‌స్తుతం 584.50 అడుగులుగా ఉంది.

కుడి, ఎడ‌మ కాలువ‌ల‌తో పాటు వ‌ర‌ద కాలువ‌, ఎస్ఎల్ బీసీ ద్వారా మొత్తం 26 క్ర‌స్ట్ గేట్ల‌లో 18 క్ర‌స్ట్ గేట్ల‌ను ఐదు అడుగుల మేర ఎత్తి 1,35,522 క్యూసెక్కుల నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు అధికారులు.

కృష్ణ పై పవన్ కామెంట్స్… రియాక్ట్ అయిన వీకె నరేష్ ఏమన్నారంటే?