ఎండ దెబ్బ‌కు ముఖం ఎర్ర‌గా మారిందా? అయితే ఈ టిప్స్ మీకే!

సాధార‌ణంగా ఒక్కోసారి ఎండ దెబ్బ‌కు ముఖం ఎర్ర‌గా క‌మిలిపోయిన‌ట్టు అయిపోతుంది.సూర్యరశ్మికి ఎక్కువ స‌మ‌యం పాటు ఎక్స్‌పోజ్ అవ్వడం వ‌ల్ల చర్మం పై పొర దెబ్బతిని ఎర్ర‌గా మారుతుంది.

దాంతో ఈ స‌మ్య‌ను నివారించుకునేందుకు ర‌క‌ర‌కాల క్రీములు వాడుతుంటారు.అయితే న్యాచుర‌ల్ ప‌ద్ధ‌తుల్లోనూ ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

మ‌రి అందు కోసం ఏం చేయాలి.? ఎలాంటి చిట్కాలు పాటించాలి.

? అన్న విష‌యాలు లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ట‌మాటా ర‌సం, రోజ్ వాట‌ర్, చిటికెడు ప‌సుపు వేసుకుని బాగా మిక్స్ చేసి.

ఐస్ ట్రేలో పోసి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.ఐస్ క్యూబ్స్ అయిన త‌ర్వాత వాటిని తీసుకుని.

ముఖానికి బాగా రుద్దుకోవాలి.అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇలా చేస్తే ఎర్ర‌గా క‌మిలిన చ‌ర్మం మ‌ళ్లీ మామూలు స్థితికి చేరుతుంది. """/" / కోకో బట‌ర్‌తో కూడా ఎండ కార‌ణంగా క‌మిలిన చ‌ర్మాన్ని త‌గ్గించుకోవ‌చ్చు.

ముందుగా కోకో బ‌ట‌ర్ తీసుకుని.ముఖానికి పూసి వేళ్ల‌తో స‌ర్కిల‌ర్ మోష‌న్‌లో మ‌సాజ్ చేయాలి.

మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మ‌సాజ్ చేసి.ఆ త‌ర్వాత డ్రై అవ్వ‌నివ్వాలి.

అప్పుడు కూల్ వాటతో ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి.ఇలా చేసినా కూడా మంచి ఫ‌లితం ఉంటుంది.

స్ట్రాబెర్రీ పండ్ల‌ను తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు రెండు స్పూన్ల స్ట్రాబెర్రీ పేస్ట్‌లో ఒక స్పూన్ తేనె వేసి క‌లుపుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి.ప‌ది లేదా ఇర‌వై నిమిషాల అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా ఎర్ర‌గా మారిన చ‌ర్మం మ‌ళ్లీ తెల్ల‌గా, కాంతి వంతంగా మారుతుంది.

భర్త అఫైర్ పెట్టుకున్నాడని అందరి ముందే పరువు తీసేసిన భార్య.. వీడియో వైరల్..