చుండ్రుకు శాశ్వతంగా చెక్ పెట్టే పొట్లకాయ..ఎలా వాడాలంటే?
TeluguStop.com
చుండ్రు.పురుషులు, స్త్రీలు అనే తేడా లేకుండా చాలా మందిని ఈ సమస్య ఇబ్బంది పెడుతుంటుంది.
దుమ్ము ధూళి, ఒత్తిడి, అందరూ ఒకే దువ్వెనను వాడటం, పోషకాల లోపం, తలపై మృత కణాలు పేరుకుపోవడం, తగినంత సమయం నిద్రపోకపోవడం, తలస్నానం చేయకపోవడం ఇలా రకరకాల కారణాల వల్ల తలలో చుండ్రు ఏర్పడుతుంది.
ఇక తలపై చుండ్రు ఉండటం వల్ల దురదతో పాటు చికాకు కూడా పుడుతుంది.
అందుకే చుండ్రును నివారించుకుందుకు రకరకాల షాంపూలు, ఆయిల్స్ వాడుతుంటారు.అయితే న్యాచురల్‌గా కూడా చుండ్రును సమస్యకు చెక్ పెట్టవచ్చు.
ముఖ్యంగా చుండ్రును శాశ్వతంగా నివారించడంతో పొట్లకాయ అద్భుతంగా సమాయపడుతుంది.వాస్తవానికి పొట్లకాయలో ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.
అందుకే ఆరోగ్యానికి పొట్లకాయ మంచిదని నిపుణులు చెబుతుంటారు.ఎన్నో జబ్బులను నయం చేయడంలోనూ పొట్లకాయ ఉపయోగపడుతుంది.
అలాగే చుండ్రు సమస్యకు కూడా పొట్లకాయ సమర్థవంతంగా చెక్ పెడుతుంది.మరి పొట్లకాయను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
"""/"/
పొట్లకాయ తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి రసం తీసుకోవాలి.ఈ పొట్లకాయ రసంలో కొద్దిగా నిమ్మ రసం యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని.
తలకు, కేశాలకు పట్టించాలి.ఒక అర గంట పాటు ఆరనిచ్చి.
అనంతరం గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే.
తలపై పేరుకుపోయిన మృత కణాలు, బ్యాక్టీరియా తొలిగిపోయి.చుండ్రు సమస్య దూరం అవుతుంది.
అలాగే పొట్లకాయను మెత్తగా పేస్ట్ చేసి అందులో పెరుగు మరియు పసుపు కలిపి తలకు, కుదుళ్లకు బాగా అప్లై చేయాలి.
అర గంట తర్వాత సాధారణ షాంపూతో హెత్ బాత్ చేసేయాలి.ఇలా మూడు రోజులకు ఒక సారి చేసినా చుండ్రు సమస్య శాశ్వతంగా పోతుంది.
మరియు జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
కూతుర్ని పైలట్‌ను చేసిన తండ్రి.. ఆయన కూడా పైలటే.. ఆమె ఫ్లైట్‌లోనే రిటైర్డ్!