రెడ్డి టైటిల్స్ తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన సినిమాలివే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెడ్డి టైటిల్స్ కు ప్రత్యేకత ఉంది.రెడ్డి టైటిల్ తో తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

బాలయ్య సినీ కెరీర్ లో ఎక్కువగా రెడ్డి టైటిల్స్ తో సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలు ఘన విజయాలను సొంతం చేసుకోవడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

బాలయ్య నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమా కూడా రెడ్డి టైటిల్ తోనే తెరకెక్కింది.బాలయ్య నటించిన చెన్నకేశవరెడ్డి, సమరసింహారెడ్డి సినిమాలు కూడా రెడ్డి టైటిల్స్ తోనే తెరకెక్కాయి.

విజయదేవరకొండ సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో అర్జున్ రెడ్డి సినిమా కూడా ఒకటి.

ఈ సినిమా అంచనాలను మించి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చిందనే సంగతి తెలిసిందే.

హీరో రాజశేఖర్ భరతసింహారెడ్డి సినిమాలో నటించగా ఈ సినిమా కూడా హిట్ గా నిలిచింది.

"""/"/ నాగచైతన్య శైలజారెడ్డి అల్లుడు సినిమాలో నటించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అబవ్ యావరేజ్ గా నిలిచింది.

తెలుగులో చిన్న సినిమాలుగా తెరకెక్కిన జాంబి రెడ్డి, జార్జి రెడ్డి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి సక్సెస్ సాధించాయి.

చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించగా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.

రెడ్డి టైటిల్స్ తో తెరకెక్కిన సినిమాలలో ఎక్కువ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి.

రాబోయే రోజుల్లో కూడా రెడ్డి టైటిల్స్ తో మరిన్ని సినిమాలు తెరకెక్కే ఛాన్స్ అయితే ఉంది.

రెడ్డి టైటిల్స్ తో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటంతో నిర్మాతలు సైతం ఈ తరహా టైటిల్స్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే1, బుధవారం 2024