రెడ్ వైన్‌లో ఇవి కలిపి రాస్తే..ముఖం అందంగా మెరిసిపోవడం ఖాయం!
TeluguStop.com
మద్యపానం ఆరోగ్యానికి హానికరమే కానీ, రెడ్ వైన్ విషయంలో మాత్రం అందుకు భిన్నం.
తగిన మోతాదులో రెడ్ వైన్‌ను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులే చెబుతుంటారు.
చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా ఉంచడంలోనూ రెడ్ వైన్ సమాయపడుతుంది.అందుకే సెలబ్రెటీల్లో చాలా మంది రెగ్యలుర్‌గా రౌడ్ వైన్‌ను సేవిస్తుంటారు.
అయితే తాగడమే కాదు రెడ్ వైన్‌ను చర్మానికి పూసుకున్నా మస్తు బెనిఫిట్స్ పొందొచ్చు.
మొటిమలను, మచ్చలను, ముడతలను తగ్గించి చర్మాన్ని అందంగా మెరిసేలా చేయడంతో రెడ్ అద్భుతంగా సహాయపడుతుంది.
మరి రెడ్ వైన్‌ను చర్మానికి ఎలా ఉపయోగించాలి అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా గ్రీన్ టీని తయారు చేసి పెట్టుకోండి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల రెడ్ వైన్, ఒక స్పూన్ గ్రీన్ టీ, ఒక స్పూన్ పెరుగు వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి.
ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనిచ్చి ఆ తర్వాత కూల్ వాటర్‌తో మెల్ల మెల్లగా రుద్దూ ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేస్తే ముఖంపై ఉండే ముడతలు పోయి చర్మం యవ్వనంగా, మృదువుగా మరియు కాంతివంతంగా మారుతుంది.
"""/" /
అలాగే ఒక బౌల్‌లో రెడ్ వైన్ తీసుకుని అందులో కొద్దిగా అలోవెర జెల్ మరియు స్వచ్ఛమైన రోజ్ వాటర్ వేసి బాగా కలపండి.
ఆ తర్వాత ఈ మిశ్రమానికి ముఖానికి ప్యాక్‌లా వేసి.పావు గంట లేదా అర గంట పాటు ఆరనిచ్చి అనంతరం వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఇలా మూడు రోజులకు ఒక సారి చేస్తే మొటిమలు మరియు నల్ల మచ్చలు తగ్గుతాయి.
అంతేకాదు, ఈ ప్యాక్ తో మెరిసేటి మరియు క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.
వ్యూహం అదిరింది బాబాయ్ .. !