జొన్న పంటను నాశనం చేసే ఎర్ర కుళ్ళు తెగుళ్ళను అరికట్టే పద్ధతులు..!
TeluguStop.com
జొన్న పంట( Red Gram )ను ఆశించే ఎర్ర కుళ్ళు తెగులు ఫంగస్ వల్ల సోకుతుంది.
ఫంగస్ కణాలు కొన్ని నెలల పాటు మట్టిలో జీవించే ఉంటాయి.అయితే ఇది మట్టి నుండి వ్యాపించదు కానీ వీటి బీజాలు పంట అవశేషాల నుండి మట్టి పైకి చేరినప్పుడు విత్తనాలకు మరియు మొలకలకు సంక్రమిస్తాయి.
వాతావరణంలో ఉండే గాలి, వాన, అధిక పొగ మంచు ద్వారా మొక్క ఆకు ఈనెల వద్దకు, కాడల వద్దకు చేరుతాయి.
నేలలో అధిక తేమ, ఒకే రకమైన పంటలను పొలంలో పదే పదే వేయడం వల్ల ఈ తెగులు పంటను ఆశించే అవకాశం ఉంది.
"""/" /
ఈ తెగులు( Red Rot Disease ) సోకిన మొక్కల కొమ్మలు పాలిపోయిన రంగులో ఉంటాయి.
మొక్కల ఆకుపై పెద్ద ఎరుపు రంగు మచ్చలను గమనించవచ్చు.కాడ లోపలి భాగంలో పొడవుగా ఉన్న ఎర్రని కూలిపోయిన కణజాలం ను కూడా గమనించవచ్చు.
లోపలి భాగంలో పగుళ్లు కూడా ఏర్పడతాయి.మొక్కలలో ఒక రకమైన దుర్వాసన కూడా రావడం జరుగుతుంది.
ఈ తెగుళ్లను సకాలంలో గుర్తించి అరికట్టడం లేదా అసలు ఈ తెగుల్లే రాకుండా మొదటి నుండి జాగ్రత్తలు తీసుకుంటేనే పంటలో అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది.
మార్కెట్లో ఎన్నో రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి.అయితే తెగులు నిరోధక రకాలను ఎంపిక చేసుకుని సాగు చేయాలి.
పంట మార్పిడి పద్ధతులను పాటిస్తే వివిధ రకాల తెగుళ్లు పంటను ఆశించవు.మొక్కలకు అధిక మొత్తంలో నీరు పెట్టడం, పొలంలో నీరు నిల్వ ఉండడం లాంటివి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
పంట కోతలు పూర్తయిన అనంతరం పంట అవశేషాలను తొలగించి కాల్చివేయాలి.వేసవిలో లోతుగా దుక్కి దున్నితే మట్టిలో ఉండే ఫంగస్ సూర్యరశ్మి వల్ల చనిపోతుంది.
"""/" /
50 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నీటిలో జొన్న విత్తనాలను( Red Gram Seeds ) రెండు గంటలు నానబెడితే ఫంగస్ చనిపోతుంది.
ఆ తర్వాత పొలంలో విత్తుకోవచ్చు.ఇక ట్రైకోడెర్మా వంటి జీవ నియంత్రణ ఏజెంట్లు కలిగిన పదార్థాల ఉత్పత్తులను ఆకులపై పిచికారి చేయడం వల్ల తెగుళ్ల విస్తరణ ఆపవచ్చు.
పొలంలో నేరుగా ఉపయోగించే రసాయన చికిత్స వల్ల పెద్దగా ఫలితం ఉండదు.
అబ్బా, ఈ పులి ఎంత క్యూట్‌గా ఉందో.. పిక్స్ చూస్తే..!!