సూపర్ ఫాస్ట్‌గా షుగర్ కంట్రోల్ కావాలా..అయితే ఇది తినాల్సిందే!
TeluguStop.com
మధుమేహం.దీనినే షుగర్ వ్యాధి అని కూడా అంటారు.
దీర్ఘకాలిక వ్యాధి అయిన మధుమేహం ఇటీవల కాలంలో ఎందరినో నానా ఇబ్బందులు పెడుతోంది.
రక్తంలో చక్కెర స్థాయిలు ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా ఉంటే ఈ వ్యాధి ఏర్పడుతుంది.
అయితే అరవై, డబ్బై ఏళ్లలో వచ్చే ఈ మధుమేహం వ్యాధి ప్రస్తుత కాలంలో ముప్పై ఏళ్లకే దాపరిస్తుంది.
మధుమేహాన్ని అదుపులో ఉంచేందుకు మందులు ఉన్నాయి.కానీ, పూర్తి నివారణకు మాత్రం ఎలాంటి చికిత్స లేదు.
అందుకే మధుమేహం వ్యాధి ఉన్న వారు బ్లడ్ షుగర్ లెవల్స్ ను ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవాలని ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతుంటారు.
అయితే వైద్య పరంగానే కాకుండా.కొన్ని కొన్ని ఆహారాల ద్వారా కూడా షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు.
ముఖ్యంగా ఎర్ర ఉల్లిపాయను తీసుకుంటే.రక్తంలో చక్కెర స్థాయిలు సూపర్ ఫాస్ట్ గా కంట్రోల్ అవుతాయని ఇటీవల చేపట్టిన ఓ ఆధ్యయనంలో తేలింది.
"""/"/
సాధారణంలో ఉల్లిపాయల్లోనే ఎరుపు, తెలుపు రంగులు ఉంటాయి.రెండు రకాల ఉల్లిపాయలు ఆరోగ్యానికి మంచివే.
రెండిటిలోనూ బోలెడన్ని పోషకాలు నిండి ఉంటాయి.అయితే తెల్ల ఉల్లితో పోల్చితే.
ఎర్ర ఉల్లిపాయల్లో షుగర్స్ తక్కువగా.యాంటిఆక్సిడెంట్లు కాస్త ఎక్కువగా ఉంటాయి.
ఇక తెల్ల ఉల్లితో పాల్చితే.ఎర్ర ఉల్లినే చక్కెర స్థాయిలను ఫాస్ట్‌గా కంట్రోల్ చేస్తుంది.
ఎర్ర ఉల్లిని వంద గ్రాములు తీసుకుంటే కేవలం నాలుగు గంటల్లోనే బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి.
అందుకే ఎర్ర ఉల్లిపాయ మధుమేహం ఉన్న వారికి ఒక ఔషధం అని చెప్పాలి.
కాబట్టి, ఎర్ర ఉల్లిని రెగ్యులర్ డైట్‌లో చేర్చుకుంటే మంచిది.ఇక ఎర్ర ఉల్లిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధి వచ్చే రిస్క్ తగ్గుతుంది.
మరియు ఎరుపు రంగు ఉల్లి మెదడు పని తీరును కూడా మెరుగు పరుస్తుంది.
హీరో నవదీప్ తో పెళ్లి …. ఫుల్ క్లారిటీ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ!