జాబ్ కోసం ఆ కుర్రాడు పంపిన రెజ్యుమేలు చూసి ముచ్చటపడుతున్న రిక్రూటర్స్!

ప్రపంచ జనాభా మితిమీరి పెరిగిపోతోంది.దాంతో ప్రతి దేశంలో నిరుద్యోగం తాండవం చేస్తోంది.

యెంత చదువుకున్నప్పటికీ విలువలేకుండా పోతోంది.ఉద్యోగాలసలే దొరకడంలేదు.

ఈ క్రమంలో కొంతమంది యువకులు వినూత్న రీతిలో విద్యోగాల వేట కొనసాగిస్తున్నారు.ప్రస్తుతం అలాంటి సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఓ వ్యక్తి తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలంటూ వినూత్న రీతిలో కంపెనీలకు తన రెజ్యుమేను పంపాడు.

కంపెనీ యజమానుల దృష్టిని ఆకర్షించడానికి అతను ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నాడు.అదేమిటంటే, అతడు దానికోసం జొమాటో ఎగ్జిక్యూటివ్‌గా అవతారమెత్తాడు.

అతగాడికి వచ్చిన ఆలోచనే తడవుగా ఓ పేస్ట్రీ బాక్స్‌లో కేక్‌తోపాటు రెజ్యూమ్‌ను కంపెనీలకు పంపించారు.

వివరాల్లోకి వెళితే, జైపూర్ కు చెందిన మేనేజ్మెంట్ ట్రైనీ మిస్టర్ అమన్ ఖండేవాల్ అనే వ్యక్తి ఉద్యోగం కోసం వినూత్న రీతిలో రెజ్యూమ్ పంపించాలని అనుకున్నాడు.

దానికోసం జొమాటో బాయ్ అవతారమెత్తి పేస్ట్రీ బాక్స్ లో కేక్ తో పాటు బెంగళూరులోని స్టార్టప్ కంపెనీలకు రెజ్యూమ్ పంపించాడు.

జొమాటో టీ-షర్ట్, పేస్ట్రీల పెట్టెతో ఉన్న ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు.

"""/"/ ఇంతకీ ఆ పోస్టులో ఏముందో తెలిస్తే ఆశ్చర్యపోతారు."అన్ని రెజ్యూమ్ లు చెత్తబుట్టలోకి వెళ్లాయి.

కానీ, నా రెజ్యూమ్ మీ పొట్టలోకి వెళ్తుంది." అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

అయితే అమన్ ఖండేవాల్ ప్రయోగం వృధా పోలేదు.తన ఐడియాని నెటిజన్లు విశేషంగా ఆదరిస్తున్నారు.

దాంతో ఖండేవాల్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ తర్వాత ట్వీట్ లో అమన్ ఖండేవాల్ తన లింక్డ్ ఇన్ ప్రొఫైల్ కూడా ను షేర్ చేశాడు.

ఫుణేలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ నుంచి పట్టభద్రుడయ్యాడు.

బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు..: డిప్యూటీ సీఎం భట్టి