కరోనా నుండి కోలుకున్న వారికి మరో అతి పెద్ద షాక్..!!

ఇండియాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే.

ఇక రాబోయేది వేసవి కాలం కావడంతో పూర్తిస్థాయిలో దేశంలో పరిస్థితులు మెరుగుపడతాయి అంటూ శాస్త్రవేత్తలు చెప్పుకొస్తున్నారు.

పైగా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి ఉండదు అనే కామెంట్లు మొన్నటిదాకా వినపడ్డాయి.

ఇలాంటి తరుణంలో గుజరాత్ రాష్ట్రంలో ఊహించని ఫంగల్ ఇన్ఫెక్షన్ బయటపడింది.కరోనా నుండి కోలుకున్న వ్యక్తిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ బయటపడటంతో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి.

కేన్సర్‌, హెచ్‌ఐవీ రోగులు, అవయవ మార్పిడి చేయించుకునే వారికి సోకుతున్నట్టు తెలుస్తోంది.అంతేకాకుండా ఒంటిలో ఇది ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి క్రమక్రమంగా మళ్ళీ తగ్గిపోవటం గ్యారెంటీ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ బారిన పడిన ఐదుగురు ఇప్పటికే మరణించినట్లు, అహ్మదాబాద్‌ ప్రభుత్వ దంత వైద్యశాల సర్జన్‌ సోనల్‌ అంచ్‌లియా వెల్లడించారు.

ముఖ్యంగా ఈ ఫంగస్ వల్ల దృష్టిలోపం, కేంద్ర నాడీ వ్యవస్థ, ఊపిరితిత్తులకు భారీ నష్టం చేకూరే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ ఫంగస్ ఎక్కువగా కరోనా నుండి కోలుకున్న వ్యక్తి లోనే కనబడే పరిస్థితి ఉందని తేల్చి చెప్పారు.

వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్.. 9 కీలక హామీలు