Mahesh Babu : అతడు..ఇప్పటికి ట్రెండ్ సెట్ చేస్తున్న మహేష్ బాబు సినిమా!
TeluguStop.com
అతడు( Athadu ).ఈ సినిమా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఒక క్లాసిక్.
అతడు థియేటర్ లలోనే కాదు, టీవీలో కూడా కొత్త రికార్డులు సృష్టించింది.ఇప్పటికి అతడు సినిమా ఎన్ని సార్లు వేసి ఉంటారంటే ఎవ్వరికి లెక్క ఉండదు.
కొందరైతే 1000 సార్లు టీవీలో ప్రసరించారంటే, 1500 సార్లు ప్రసరించారని కొందరు డిబేట్ చేసుకుంటారు.
కానీ నిజానికి లెక్క ఎవ్వరికి తెలియదనే చెప్పాలి.మరి ఈ సినిమాని బ్రేక్ చేసే మరో సినిమా బాహుబలి అంటున్నారు.
కానీ ఇప్పట్లో ఈ రికార్డుని మాత్రం ఏ సినిమా బద్దలు కొత్తదనే చెప్పాలి.
అతడు.ఎన్నిసార్లు టీవీలో ప్రసారం చేసినా రేటింగ్ మాత్రం వస్తూనే ఉంది.
జనాలు ఈ సినిమాని ఇదివరకే చూసిన మళ్ళీ ప్రసరిస్తే మళ్ళీ మళ్ళీ చూసారు.
దీనికి కారణం ఒక్కటే అని చెప్పలేం.దీనికి చాలా కారణాలు ఉన్నాయి.
"""/" /
2005 ఆగస్టులో అతడు సినిమా విడుదలైంది.ఈ సినిమా మహేష్ బాబుకి( Mahesh Babu ) బ్లాక్ బస్టర్ ని అందించింది.
ఇక ఈ సినిమాలో త్రివిక్రమ్ మాటల గురించి అయితే చెప్పనక్కర్లేదు.ప్రతి సీన్ లో తన మార్క్ కనిపిస్తుంది.
ఇక ఈ సినిమాలో మరో ప్లస్ త్రిష( Trisha ).ఇక ఈ సినిమాలో లాస్ట్ లో ఒక డైలాగ్ కూడా గురూజీ అద్భుతంగా రాసారు.
నేను వస్తా అని పూరి అడిగితే నేనే వస్తా అని పార్థు చెప్పే సీన్ అయితే విజిల్స్ వేయించింది.
ఈ ఒక్క సీన్ మాత్రమే కాదు అతడు సినిమాలో ఇలాంటి ఎన్నో అద్భుతమైన టైమింగ్ డైలాగులు ఉన్నాయి.
"""/" /
అప్పటివరకు డబ్బు కోసం చంపడానికి అయినా సిద్ధంగా ఉండే పార్థు జీవితం ఒక్కసారిగా మారిపోతుంది.
అక్కడి నుంచి సినిమా మరోస్థాయికి వెళ్తుంది.ఫ్యామిలీలో కలిసిపోయి అదే ఫ్యామిలీ బంధానికి దగ్గరైపోతాడు.
ఇక అక్కడ పార్థు-పూరికి జరిగే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి.ఇక పొలంలో జరిగే సీన్ అయితే ఇప్పటి మిమర్స్ బాగా వాడుకుంటున్నారు.
ఈ సినిమా టీవీలో రికార్డు సృష్టించడానికి ముఖ్య కారణం కథ, నటన అనే చెప్పాలి.
ఈ సినిమాలో పాటలు, కామెడీ సీన్ లు, ఫైట్ లు, డైలాగులు అద్భుతంగా ఉండడంతో టాప్ రేటింగ్ వచ్చింది.
ఇప్పుడు ఇదే తరహాలో బాహుబలిని కూడా ప్రసరిస్తున్నారు.కానీ ఈ రికార్డుని అందుకోవడం అంటే ఇంకా టైం పడుతుంది.
అయితే ఈ సినిమా ముందు పవన్ కళ్యాణ్ చేయాల్సి ఉండింది.ముందు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కి కథ వినిపిస్తే పవన్ లైట్ గా తీసుకున్నారు.
ఆ తరువాత మహేష్ కి చెబితే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ కొట్టింది.
ఇది అతడు పూర్తి కథ అనమాట.
క్యాన్సర్ పై పోరాడుతున్న నాపై అలాంటి కామెంట్లు.. నటి సంచలన వ్యాఖ్యలు వైరల్!