కిలో టీపొడి 99,999.. అస్సాం మనోహరి గోల్డ్ టీ డిమాండ్..!

మాములుగా అయితే కిలో టీ పొడి ధర ఎంత ఉంటుంది.1000 లేదా 2000 రూపాయలు .

కాని అస్సాం మనోహరి టీ మాత్రం కిలో రేటు తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది.

వెయ్యి రెండు వేలు కాదు ఏకంగా 99,999 అంటే లక్షకి ఒక్క రూపాయ్ తక్కువ కిలో టీ పొడి డిమాండ్ చేసింది.

ఇంతకీ అది ఎక్కడా అనేగా.అస్సాం లో మనోహరి టీ కి ఈ భారీ రేటు పలికింది.

వర్గం బేధం లేకుండా.ఎలాంటి వారైనా.

ఎప్పుడైనా.ఎక్కడైనా తాగే ఈ టీకి మన దేశంలో చాలా డిమాండ్ ఉంటుంది.

అయితే వీటిలో కొన్ని స్పెషల్ టీ పొడులకు డిమాండ్ ఒక రేంజ్ లో ఉంటుంది .

అస్సాంలో ఎక్కువగా టీ దొరుకుతుంది.అందుకే అక్కడ ఏటా పలు సంస్థలు అరుదైన రకానికి చెందిన కొన్ని టీ పొడులను వేలం పాట వేస్తారు.

ఈ వేలంలో ఈసారి మనోహరి గోల్డ్ టీ కి రికార్డ్ రేటు ఇచ్చి కొన్నారు.

గువాహతి టీ ఆక్షన్ లో జరిగిన వేలంలో మనోహరి గోల్డ్ టీ కిలో 99,999 పలికింది.

లాస్ట్ ఇయర్ 75000 పలికిన దీని ధర ఈసారి లక్షకు దగ్గరగా వెళ్లింది.

సౌరవ్ టీ ట్రేడర్స్ అనే సంస్థ మంగళవారం జరిగిన వేలంలో రికార్డ్ ప్రైజ్ కి మనోహరి గోల్డ్ టీ అమ్ముడైంది.

ఏందిది, క్లాస్‌రూమ్‌లోకి వచ్చేసిన బర్రె.. డిగ్రీ చేస్తుందట.. వీడియో సీన్ చూస్తే నవ్వాపుకోలేరు!