తిరుమల శ్రీవారికి రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం

తిరుమల శ్రీనివాసునికి రికార్డ్ స్థాయిలో కానుకలు సమర్పించారు భక్తులు.ఒక్క రోజే దాదాపు 6 కోట్ల 31 లక్షల రూపాయల నగదును హుండీ ద్వారా కానుకగా సమర్పించారు.

టిటిడి చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో నగదు రావడం ఇదే మొదటి సారి.

ఈ ఏడాది ఏప్రిల్ 1న 6 కోట్ల 18 లక్షల రూపాయలు నగదు హుండీ ద్వారా కానుకగా లభించగా, 2018 లో 6 కోట్ల 20 లక్షల రూపాయలు హుండీ రాబడి వచ్చింది.

మరో వైపు తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతునే ఉంది.ఒక రోజులో 80 వేల 565 మంది భక్తులు స్వామివారిని దర్శించుకొగా.

31 వేల 608 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించారు.

ప్రసాద్ బెహరాపై పరోక్షంగా కామెంట్స్ చేసిన రేఖా భోజ్.. నిజస్వరూపం ఇదేనంటూ?