కెనడా ఫెడరల్ ఎన్నికల్లో భారత సంతతి అభ్యర్ధుల హవా .. ఎంత మంది గెలిచారో తెలుసా?

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయులు ఆయా దేశాల రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

చాలా దేశాల్లో ప్రధానులుగా, అధ్యక్షులుగా , మంత్రులుగా, సెనేటర్లుగా, మేయర్లుగా భారతీయులు రాణిస్తున్నారు.

అమెరికాను ఆనుకుని ఉండే కెనడా( Canada ) రాజకీయాల్లోనూ భారతీయులు ఇప్పుడు సత్తా చాటుతున్నారు.

భారత సంతతికి చెందిన న్యూ డెమొక్రాటిక్ పార్టీ నేత (ఎన్‌డీపీ) జగ్మీత్ సింగ్( Jagmeet Singh ) నిన్న మొన్నటి వరకు కింగ్ మేకర్‌గా వ్యవహరించారు.

ఏప్రిల్ 28న కెనడాలో ఫెడరల్ ఎన్నికలు( Canada Federal Elections ) జరగ్గా ఈసారి కూడా పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు బరిలో నిలిచారు.

కన్జర్వేటివ్‌లు, లిబరల్స్‌తో పాటు అన్ని ప్రధాన పార్టీలు భారతీయులకు టికెట్లు కేటాయించాయి.కొన్ని ఏరియాలలో ప్రత్యర్ధులంతా భారతీయులే కావడం గమనార్హం.

ముందస్తు అంచనాలను నిజం చేస్తూ పదుల సంఖ్యలో భారతీయులు కెనడా ఎన్నికల్లో విజయం సాధించారు.

కెనడాలోని భారతీయ కమ్యూనిటీలో ఆధిపత్యం చెలాయిస్తున్న పంజాబీలు రికార్డు స్థాయిలో ఈసారి ఎన్నికయ్యారు.

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏకంగా 22 మంది పంజాబీలు హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికయ్యారు.

2021లో 18 మంది, 2019లో 20 మంది పంజాబీలు ఎన్నికయ్యారు. """/" / H3 Class=subheader-styleలిబరల్ పార్టీ నుంచి గెలిచిన భారత సంతతి నేతలు :/h3p ఓక్విల్లే ఈస్ట్ నుండి అనితా ఆనంద్( Anita Anand ) వాటర్లూ నుండి బార్డిష్ చాగర్( Bardish Chagger ) డోర్వాల్ లాచిన్ నుండి అంజు ధిల్లాన్ సర్రే న్యూటన్ నుండి సుఖ్ ధాలివాల్ మిస్సిసాగా మాల్టన్ నుండి ఇక్వీందర్ సింగ్ గహీర్ సర్రే సెంటర్ నుండి రణదీప్ సారాయ్ ఫ్లీట్‌వుడ్ పోర్ట్ కెల్స్ నుండి గుర్బాక్స్ సైనీ రిచ్‌మండ్ ఈస్ట్ స్టీవ్‌స్టన్ నుండి పరమ్ బెయిన్స్ H3 Class=subheader-styleకన్జర్వేటివ్ పార్టీ నుండి గెలిచిన భారత సంతతి నేతలు :/h3p """/" / కాల్గరీ ఈస్ట్ నుండి జస్రాజ్ హల్లాన్( Jasraj Hallan ) కాల్గరీ మెక్‌నైట్ నుండి దల్వీందర్ గిల్( Dalwinder Gill ) కాల్గరీ స్కైవ్యూ నుండి అమన్‌ప్రీత్ గిల్ ఆక్స్‌ఫర్డ్ నుండి అర్పాన్ ఖన్నా ఎడ్మంటన్ గేట్‌వే నుండి టిమ్ ఉప్పల్ మిల్టన్ ఈస్ట్ నుండి పార్మ్ గిల్ అబోట్స్‌ఫోర్డ్ సౌత్ లాంగ్లీ నుండి సుఖ్మాన్ గిల్ ఎడ్మంటన్ సౌత్ ఈస్ట్ నుండి జగశరన్ సింగ్ మహల్ విండ్సర్ వెస్ట్ నుండి హార్బ్ గిల్ .