ఇంట్లో పవిత్ర గ్రంథం ఖురాన్ పారాయణం.. చేస్తే ఇన్ని శుభాలు కలుగుతాయా..!

ఒక గ్రామంలో మసీదు ఇమామ్ కు ఒక్కొక్కరి ఇంట్లో విందు ఏర్పాటు చేస్తూ ఉన్నారు.

ఒక రోజు గ్రామానికి చెందిన జైనుల్లా( Jains ) వంతు వచ్చింది.మొదటిసారి ఇమామ్ తన ఇంటికి విందుకు వస్తున్నాడని జైనుల్లా దంపతులు ప్రత్యేక వంటకాలు చేశారు.

ఇమామ్ ను ఆ దంపతులు ఘనంగా స్వాగతించారు.ఆయనను ఇంట్లో కూర్చోబెట్టి ఇప్పుడే వస్తానంటూ జేనుల్లా బయటికి వెళ్లాడు.

ఏమి తోచక అక్కడే బల్ల మీద ఉన్న ఖురాన్ ప్రతిని తీసి ఇమామ్ చదవడం మొదలుపెట్టాడు.

కాసేపటికి జైనుల్లా వచ్చి ఇమామ్ ( Imam )ను భోజనానికి పిలిచాడు.అంతలో జైనుల్లా భార్యా గదిలో బల్ల మీద ఉంచిన డబ్బులు కనిపించడం లేదని ఇల్లంతా వెతకడం మొదలుపెట్టింది.

ఎక్కడ కనిపించలేదు అతిథిగా వచ్చిన ఇమామే డబ్బులు కాజేసి ఉంటాడని భర్తతో చెప్పింది.

జైనుల్లా కూడా ఇమామ్ ను అనుమానించాడు.మరుసటి రోజు నుంచి జైనుల్లా మసీదుకు వెళ్ళిన ఇమామ్ ను కలిసేవాడు కాదు.

అందరికంటే చివరిగా వచ్చి ముందుగా వెళ్ళిపోయేవాడు. """/" / ఇలా కొన్ని నెలలకు మళ్ళీ ఇమామ్ కు విందు ఏర్పాటు చేసేందుకు జైనుల్లా వంతు వచ్చింది.

ఇష్టం లేకపోయినా విందు ఏర్పాటు చేశాడు.భోజనం చేస్తున్న ఇమామ్ జైనుల్లా వాలకం చూసి నువ్వు చాలా కాలంగా నాతో మాట్లాడడం లేదు.

మసీద్( Mosque ) కు వచ్చినా కలవడం లేదు ఎందుకు అని ప్రశ్నించాడు.

మీరు గతంలో భోజనానికి వచ్చినప్పుడు మా ఇంట్లో డబ్బులు మాయమయ్యాయి. """/" / ఆ డబ్బు మీరే తీసారని మాకు అనుమానం అని మనసులోని మాట బయటికి చెప్పాడు.

ఆ మాట వినగానే ఇమామ్ వేక్కివెక్కి ఏడ్చాడు.జైనుల్లా ఆయన ను ఓదార్చే ప్రయత్నం చేశాడు.

నేను ఏడుస్తున్నది నా మీద మీరు దొంగతనం మోపినందుకు కాదు.ఇంతకాలంగా మీరు ఈ ఖురాన్ గ్రంధాన్ని( Quran ) ముట్టుకోనందుకు నా బాధంతా అన్నాడు.

ఇమామ్ చెపుతున్న మాటలు జైనుల్లా అర్థం కాలేదు.ఆరోజు నువ్వు వెళ్ళగానే ఈదురుగాలులో కిటికీలు తెరుచుకున్నాయి.

డబ్బు గాలికి కొట్టుకుపోతుంటే వాటిని ఏరి ఖురాన్ గ్రంథంలో భద్రపరిచాను.ఆ విషయం మీకు చెప్పడం మర్చిపోయాను అని ఇమామ్ చెప్పాడు.

ఆ మాటలు వినడంతో జనుల దంపతులు పశ్చాత్తాపంతో కృంగిపోయారు.రోజు ఖురాన్ పారాయణం చేస్తే ఇంట్లో శుభాలు కురుస్తాయి.

ఎన్నో అనుమానాలు, భయాలు దూరం అవుతాయి.సన్మార్గం చూపే గ్రంధాన్ని తెరవకుండా ఉంచితే ఇలాంటి అనుమానాలు వెంటాడుతూ ఉంటాయని ఇమామ్ చెప్పాడు.