వర్షాకాలంలో ఆ జాగ్రత్తలు తీసుకుంటే జలుబు, దగ్గుకు దూరంగా ఉండొచ్చు!
TeluguStop.com

వేసవి కాలం వెళ్లి వర్షాకాలం వచ్చింది.ఈ సీజన్‌లో ప్రధానంగా వేధించే సమస్యల్లో జలుబు, దగ్గు ముందు వరసలో ఉంటాయి.


ఇవి పట్టుకున్నాయంటే ఓ పట్టాన పోవు.పైగా ఇంట్లో ఒకరికి వచ్చాయంటే చాలు.


మిగిలిన వారందరికీ పాకేస్తుంటాయి.అయితే జలుబు, దగ్గు వచ్చాక బాధపడటం కంటే.
రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు.మరి ఆ జాగ్రత్తలు ఏంటో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
జలుబు, దగ్గు దరి చేరకుండా ఉండాలంటే రోగ నిరోధక వ్యవస్థ స్ట్రోంగ్‌గా ఉండటం ఎంతో ముఖ్యం.
అయితే అందుకు హెర్బల్ టీలు అద్భుతంగా సహాయపడతాయి.ముఖ్యంగా గ్రీన్ టీ, పుదీనా టీ, తులసి టీ వంటివి తీసుకుంటే రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.
జలుబు, దగ్గుకు దూరంగా ఉండాలంటే పరిశుభ్రత ఎంతో ముఖ్యం.ఇంటిని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
రోజుకు రెండు సార్లు స్నానం చేయాలి.ఏదైనా ఆహారం తీసుకునే ముందు తప్పకుండా చేతులను వాష్ చేసుకోవాలి.
వర్షాకాలంలో చాలా మంది వ్యాయామాలను ఎవైడ్ చేస్తుంటారు.ఈ పొరపాటు మీరు మాత్రం చేయకండి.
ఎందుకంటే.వ్యాయామాలు ఆరోగ్యానికి, ఫిట్‌నెస్‌కు మాత్రమే కాదు సీజనల్ వ్యాధులు దరి చేరకుండా అడ్డుకట్ట వేసేందుకు కూడా సహాయపడతాయి.
కంటి నిండా నిద్ర.ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా వివరించక్కర్లేదు.
అయినప్పటికీ కొందరు నిద్రను నిర్లక్ష్యం చేస్తుంటారు.దాంతో ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ అవుతుంది.
ఫలితంగా జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.అందువల్ల, రోజుకు ఏడు నుండి ఎనిమిది గంటలు తప్పకుండా పడుకోవాలి.
ఇక ఈ వర్షాకాలంలో జలుబు, దగ్గుకు దూరంగా ఉండాలంటే విటమిన్ డి, విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలి.
పాలను డైరెక్ట్‌గా కాకుండా పసుపు, మిరియాలు, శొంఠి వంటివి కలిపి తీసుకోవాలి.వర్షంలో తరచూ తడవకుండా జాగ్రత్త పడాలి.
సీజన్ వారీగా వచ్చే పండ్లు, కూరగాయలు తప్పకుండా తీసుకోవాలి.
ఆ రీజన్ వల్లే సింపుల్ గా పెళ్లి చేసుకున్నాను.. రకుల్ ప్రీత్ సింగ్ క్రేజీ కామెంట్స్!