సీనియర్ నటుడు కృష్ణంరాజు కన్నుమూత

సినీ ఇండస్ట్రీలో తాజాగా ఒక విషాదం చోటు చేసుకుంది.టాలీవుడ్ సీనియర్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు.

కాగా గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణంరాజు తాజాగా ఆయన పరిస్థితి మరింత విషమించడంతో హైదరాబాదులోనే ఏఐజి హాస్పిటల్ లో చేర్పించారు.

ఈ నేపథ్యంలోనే చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు.కృష్ణంరాజు మరణంతో ఆయన కుటుంబంలో ఒక్కసారిగా విశాద ఛాయలు అమ్ముకున్నాయి.

ఆయన మరణ వార్త విని అభిమానులు కూడా తీవదిబ్బందికి లోనయ్యారు.కాగా కృష్ణంరాజు మొన్నటి వరకు కూడా సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.

ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాలో కూడా నటించారు.అంతేకాకుండా సినిమా ప్రమోషన్స్ లో కూడా బాగానే పాల్గొన్నారు.

ఇటీవల జరిగిన ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలలో కూడా పాల్గొన్నారు.కానీ గత కొంతకాలంగా శ్వాస కోస సమస్యలతో బాధపడుతున్న కృష్ణంరాజు ఎప్పటికప్పుడు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూనే ఉన్నారు.

"""/" / కానీ తాజాగా ఆయన పరిస్థితి మరింత విషమించడంతో మరణించారు.కృష్ణంరాజు మరణ వార్త విన్న పలువురు ప్రముఖులు ఆయనకు సంతాపం వ్యక్తం చేశారు.

కృష్ణంరాజు మరణం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పవచ్చు.

ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు వేస్టా.. మొబైల్స్ లాగా తయారవుతున్నాయా..?