బాబ్బాబు నామినేషన్ ఉపసంహరించుకోండి !

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది.ఇప్పటికే నామినేషన్ ల గడువు ముగియడంతో , పూర్తిగా ఎన్నికల ప్రచారంపైనే అన్ని పార్టీలు దృష్టిపెట్టాయి.

ఇంకా నామినేషన్ ల ఉప సంహరణ కు నేటితో గడువు ముగియనున్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు తమ పార్టీ టికెట్ ఆశించి అసంతృప్తికి గురై రెబల్స్ గా బరిలో దిగిన నేతలను బుజ్జగించే పనుల్లో నిమగ్నం అయ్యాయి.

రెబల్స్ గానే కాకుండా,  కొన్ని ప్రధాన నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు వివిధ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నామినేషన్లు వేసిన వారిని బుజ్జగించే ప్రయత్నంలో ప్రధాన పార్టీలన్నీ నిమగ్నం అయ్యాయి.

"""/" /  రెబల్ అభ్యర్థులు పోటీలో ఉన్నచోట వారిని నామినేషన్లను ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుతున్నాయి.

కచ్చితంగా తమ పార్టీ అధికారంలోకి వస్తుందని,  ఇప్పుడు నామినేషన్ లను ఉపసంహరించుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైన పదవులు ఇస్తామని,  మీరు పోటీలో ఉండడం వల్ల మన పార్టీ అభ్యర్థి పడాల్సిన ఓట్లు చీలి ప్రత్యర్థులు గెలుస్తారని , అలా జరగకుండా నామినేషన్లను ఉపసంహరించుకుని ప్రయోజనం పొందాలని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి.

  తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ కు 12 చోట్ల అభ్యర్థులు పోటీలు ఉన్నారు.

వీరందరికీ స్వయంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యరావు ఫోన్లు( Manikrao Thakre ) చేసి నామినేషన్లను ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుతున్నారు.

  ఇప్పుడు ఉపసంహరించుకుంటే ఎంత మేరకు ప్రయోజనం కలుగుతుందనేది వివరిస్తున్నారు. """/" / కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని , అలా వచ్చిన వెంటనే మీకు నామినేటెడ్ పదవులు ఇస్తామని,  రెబల్స్ కు మాణిక్ రావు ఠాక్రే ఫోన్ చేసి మరి బుజ్జగిస్తున్నారు .

ఇక బీఆర్ఎస్ కూడా ఇదేవిధంగా రెబెల్స్  పై ఫోకస్ పెట్టింది .ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్( CMK KCR ) పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గం లో అత్యధికంగా ఈసారి నామినేషన్లు దాఖలు అయ్యాయి .

114 మంది తమ నామినేషన్లను దాఖలు చేశారు.  వీరిలో చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలని కోరుతూ కొంతమంది,  తమ భూములను తమకు ఇప్పించాలని వట్టి నాగులపల్లి ప్రజలు , ఉద్యోగాలు కల్పించాలని , ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని ఇంకొంతమంది నామినేషన్లు దాఖలు చేయడంతో వీరందరినీ బుజ్జగించేందుకు బిఆర్ఎస్ కీలక నేతలు రంగంలోకి దిగారు.

కచ్చితంగా మీ సమస్యలు పరిష్కరిస్తామని నామినేషన్ ఉపసంహరించుకోవాలని నచ్చచెప్పి ప్రయత్నం చేస్తున్నారు.ఇప్పటికే గజ్వేల్ లో నామినేషన్ వేసిన 114 మందిలో 28 మంది వరకు ఉపసంహరించుకోగా , మిగిలివారికి నచ్చ చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి .

బిజెపి( BJP ) కూడా ఇదే రకమైన బుజ్జగింపులకు దిగుతోంది.

శోభితతో తొలి పరిచయం అక్కడే జరిగింది.. నాగచైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్!