‘సెక్యూరిటీ గార్డ్స్’ నల్ల కళ్లద్దాలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?
TeluguStop.com
ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల వెనుక ఉండే కమాండోలు నల్ల కళ్లద్దాలు పెట్టుకుని కనిపిస్తున్నారు.
అయితే కమాండోలు నల్ల కళ్లద్దాలు మాత్రమే ఎందుకు పెట్టుకుంటారు.? ఇతర కళ్లద్దాలు ఎందుకు వాడరు? అనే అనుమానం చాలామందికి కలుగుతోంది.
కమాండోలు నల్ల కళ్లద్దాలు వాడటం వెనుక ఆసక్తికరమైన కారణాలే ఉన్నాయి.యూనిఫాం వేసుకుని నల్ల కళ్లద్దాలతో ఉండే కమాండోలు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలకు ఎల్లప్పుడూ రక్షణ కల్పిస్తూ ఉంటారు.
అయితే వాళ్లు అలా నల్ల కళ్లద్దాలు పెట్టుకునేది స్టైల్ కోసం ఏ మాత్రం కాదు.
వీళ్లు నల్ల కళ్లద్దాలు ధరించడం వల్ల అవతలి వ్యక్తుల కదలికలను సులభంగా గమనించగలుగుతారు.
అయితే అవతలి వ్యక్తులకు మాత్రం వీళ్లు ఎటువైపు చూస్తున్నారనే విషయం అర్థం కాదు.
జనాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే వారి కదలికలను సులభంగా కనిపెట్టడానికి కమాండోలు, బాడీగార్డులు నల్ల కళ్లద్దాలను వినియోగిస్తారు.
అవతలి వ్యక్తులు ఏదైనా తప్పు చేస్తున్నట్టు అనిపిస్తే వెంటనే అదుపులోకి తీసుకుని విచారిస్తారు.
అంతే కాక ప్రముఖులపై ఎవరైనా అటాక్ చేసినా నల్ల కళ్లద్దాలు ధరిస్తే దుమ్ము, ధూళి వల్ల కంటి చూపు డైవర్ట్ కాకుండా ఉంటుంది.
సూర్య కాంతి, ఇతర రిఫ్లెక్షన్ల సమస్యలు కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉండవు.
నల్ల కళ్లద్దాలు ధరిస్తే వాతావరణం ఎలా ఉన్నా అవతలి వ్యక్తులను సులభంగా గమనించడం సాధ్యమవుతుంది.
అందువల్లే కమాండోలు ఎక్కువగా నల్ల కళ్లద్దాలను వినియోగించడానికి ఆసక్తి చూపిస్తారు.
ప్రియదర్శి కోర్ట్ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయిందా.. ఆరోజు నుంచి స్ట్రీమింగ్ కానుందా?