కమ్మ సామాజికవర్గానికి జగన్ దూరం అవుతున్నాడా?
TeluguStop.com
2024 ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు నాయుడును, ఆయన కుమారుడు నారా లోకేష్‌ను వైఎస్ జగన్ టార్గెట్ చేస్తున్నారనేది స్పష్టమవుతోంది.
జగన్ స్పీడ్ కాస్త ఆయనకు వ్యతిరేకంగా మారేలా కనిపిస్తుంది.యన చేస్తున్న దాడులను చంద్రబాబు వ్యతిరేకిగా కాకుండా ఎన్టీఆర్ వ్యతిరేకంగా చూస్తున్నారా అనే సందేహం సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఆయన ఎన్టీఆర్ కుటుంబానికి, కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకం అనే భావన సమాజంలో తప్పుడు సంకేతాలను పంపే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.
చంద్రబాబును వ్యతిరేకతకంగా తీసుకుంటున్నా నిర్ణయాలు కాస్త ఎన్టీఆర్ టార్గెట్ చేసేలా ఉండడంతో పలు సామాజిక వర్గాలు జగన్ వ్యతిరేకంగా మారే అవకాశం ఉన్నట్లు, ఈ విషయంలో జగన్ తొందరగా మేలుకుంటే మంచిదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఉదాహరణకు అన్నా క్యాంటీన్లపై, వైసీపీ ప్రవర్తిస్తున్న తీరు ఎన్టీఆర్ లక్ష్యంగా ఉన్నట్లు స్ఫష్టమవుతుంది.
ఇది ఎన్టీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రయత్నంగా కనిపిస్తుందన్నారు.అదేవిధంగా ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చడం కూడా ఎన్టీఆర్ వ్యతిరేక ఎత్తుగడగా చూస్తున్నారు.
"""/"/
ఎన్టీఆర్ కుమార్తెలు నారా భువనేశ్వరిపై వ్యక్తిత్వం దాడి చేసిన తీరు, మామహేశ్వరి ఆత్మహత్యను రాజకీయం చేసే ప్రయత్నాలు వైసీపీపై ప్రజల్లో కాస్త వ్యతిరేకతకు దారి తీశాయి.
దీంతో ఈ విషయంపై వైసీపీ కూడా వెనకడుగు వేయాల్సి వచ్చింది.ఎన్.
టి.ఆర్ కుటుంబాన్ని ఈ విధంగా టార్గెట్ చేయడం వాస్తవానికి రాష్ట్రంలో కమ్మ సామాజికవర్గానికి దూరమయ్యేందుకు దారితీస్తోందని విశ్లేషకులు అంటున్నారు.
ఆ సామాజికవర్గం ఇప్పటికే టీడీపీతో ఉందని, ఈ పరిణామాలు వారి వైఎస్సార్సీపీ వ్యతిరేక వైఖరిని మరింత బలపరుస్తాయని విశ్లేషకులు అంటున్నారు.
చంద్రబాబును బలహీనపరిచే బదులు ఆయనను బలోపేతం చేయడమే అవుతుందని వారు హెచ్చరిస్తున్నారు.మెుత్తం మీద ఏపీ రాజకీయాలు వేడెక్కాయి.
వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య జరుగుతున్న ఈ యుద్దంలో ప్రజల అసలు సమస్యలు పక్కా దారి పడుతున్నాయని
పలువురు ఆరోపిస్తున్నారు.