ఎంతో టాలెంట్ ఉన్న విశ్వక్ సేన్ కు వరుస ఫ్లాపుల వెనుక కారణాలివేనా?
TeluguStop.com
సినిమా రంగంలో ప్రతి వారం పదుల సంఖ్యలో నటీనటులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.ఆర్థికంగా స్థిరపడిన వాళ్లు సినిమాల్లో సక్సెస్ కావడం కోసం సొంతంగా సినిమాలను నిర్మిస్తున్న సందర్భాలు సైతం ఉన్నాయి.
అయితే ఈ ప్రయత్నంలో 10 శాతం మంది సక్సెస్ సాధిస్తుండగా 90 శాతం మంది మాత్రం ఫెయిల్ అవుతున్నాయి.
అయితే తన ప్రతిభతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విశ్వక్ సేన్ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
మంచి కథ, కథనం ఉన్న సినిమాలను విశ్వక్ సేన్ ఎంపిక చేసుకుంటుండగా వేర్వేరు కారణాల వల్ల విశ్వక్ సేన్ కు షాకులు తగులుతున్నాయి.
అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఫస్ట్ వీకెండ్ తర్వాత ఈ సినిమా కలెక్షన్లు తగ్గాయి.
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విషయంలో ఈ సినిమా ఫెయిల్ అయిందనే సంగతి తెలిసిందే.
ఓరి దేవుడా సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేదు.
"""/"/
వెంకటేష్ లాంటి సీనియర్ హీరో నటించినా ఓరి దేవుడా సినిమాకు షాకింగ్ ఫలితం రావడం ఫ్యాన్స్ ను హర్ట్ చేసింది.
మరోవైపు ముఖచిత్రం అనే సినిమాలో విశ్వక్ సేన్ కీలక పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు.చాలామంది ప్రేక్షకులు ఈ సినిమాను పట్టించుకోలేదు.
విశ్వక్ సేన్ సినిమాల ఫలితాలు ఫ్యాన్స్ ను ఎంతగానో హర్ట్ చేస్తున్నాయి.సరైన రిలీజ్ డేట్లను ఎంచుకోకపోవడం, వరుసగా వివాదాల్లో చిక్కుకోవడం, వేగంగా సినిమాల్లో నటించడం, సినిమాకు ప్రమోషన్స్ చేసే విషయంలో చేస్తున్న చిన్నచిన్న తప్పిదాలు విశ్వక్ సేన్ కెరీర్ కు మైనస్ అవుతున్నాయి.
విశ్వక్ శేన్ కెరీర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వైరల్ వీడియో : కోహ్లీ నువ్వేమి అసలు మారలేదుగా.. హర్భజన్‌ను ఆటపట్టిస్తూ డాన్స్