Varun Tej Lavanya Tripati : ఆ ఆలయంలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రత్యేక పూజలు చేయడానికి కారణాలివేనా?
TeluguStop.com
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి క్యూట్ జోడీ అని సూపర్ జోడీ అని అభిమానులు భావిస్తారు.
పెళ్లి తర్వాత అన్యోన్యంగా ఉన్న ఈ జోడీ కెరీర్ పరంగా కూడా బిజీగా ఉన్నారు.
వరుణ్ తేజ్( Varun Tej ) వరుస సినిమాలతో బిజీగా ఉండగా లావణ్య త్రిపాఠి( Lavanya Tripati ) వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు.
అయితే తాజాగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఒక ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేయగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గోదావరి తల్లిని దర్శించుకోవడంతో పాటు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
పూజలో తాను భాగమైనట్లు ఫోటోల ద్వారా లావణ్య త్రిపాఠి వెల్లడించారు.ఆపరేషన్ వాలంటైన్( Operation Valentine ) బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు పెళ్లి తర్వాత జీవితం మరింత సంతోషంగా ఉండాలని భావించి వరుణ్ తేజ్ ఈ ఆలయాన్ని దర్శించుకున్నారని సమాచారం అందుతోంది.
"""/" /
ఆపరేషన్ వాలంటైన్ మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి మరో ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది.
ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే.వరుణ్ తేజ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో( Operation Valentine Promotions ) భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు.
వరుణ్ తేజ్ కెరీర్ లోనై హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.
ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. """/" /
ఆపరేషన్ వాలంటైన్ సినిమా సక్సెస్ సాధించి మంచి లాభాలను అందించడం ఖాయమని మెగా అభిమానులు భావిస్తున్నారు.
ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతున్న ఆపరేషన్ వాలంటైన్ బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది.
పెళ్లి తర్వాత కూడా లావణ్య త్రిపాఠికి భారీ సంఖ్యలో ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.
దంతాల సెన్సిటివ్‌గా మారడానికి కారణాలేంటి.. నివారణ ఎలా?