సుమ యాంకర్ గా సక్సెస్ కావడానికి ఆ షో కారణమా.. అట్టర్ ఫ్లాప్ అనుకున్న షో చివరకు?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ యాంకర్ గా సుమ కనకాలకు మంచి పేరు ఉంది.
సుమ( Suma ) నంబర్1 యాంకర్ గా 20 సంవత్సరాల నుంచి కెరీర్ ను కొనసాగించడం వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయి.
అయితే ఆమె ఈ స్థాయిలో సక్సెస్ కావడానికి కారణమైన షో ఏదనే ప్రశ్నకు మాత్రం అవాక్కయ్యారా షో ( Avvakayyara Show )పేరు జవాబుగా వినిపిస్తుంది.
కెరీర్ పరంగా కొంతకాలం గ్యాప్ తీసుకున్న సుమ 2004 సంవత్సరంలో ఈ షోతో రీఎంట్రీ ఇచ్చారు.
ఈ షోకు మొదటి మూడు రోజుల పాటు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు.
సుమ కూడా ఈ షో సక్సెస్ కావడం కష్టమే అని అనుకున్నారు.అయితే ఊహించని విధంగా తర్వాత రోజుల్లో ఈ షో సక్సెస్ కావడం జరిగింది.
సుమ ఇప్పుడు పరిమితంగా షోలు చేస్తున్నా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో( Pre-release Events ) మాత్రం సుమ హవా ఇప్పటికీ కొనసాగుతోంది.
పెద్ద హీరోలు అయినా, చిన్న హీరోలు అయినా సుమ ఈవెంట్ కు హోస్ట్ గా వ్యవహరించాల్సిందే.
"""/" /
పారితోషికం పెరిగినా సుమకు ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు.సుమ ఈవెంట్ ను హోస్ట్ చేస్తే సినిమా హిట్ అనే సెంటిమెంట్ సైతం ఇండస్ట్రీలో ఉంది.
సుమ 49 సంవత్సరాల వయస్సులో సైతం ఎంతో కష్టపడుతున్నారు.మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను మార్చుకుంటున్నారు.
సుమకు మరో ఐదేళ్ల పాటు కెరీర్ పరంగా ఢోకా లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
"""/" /
సమయస్పూర్తిగా మాట్లాడటం సుమకు మరింత కలిసొచ్చిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
యంగ్ జనరేషన్ ( Young Generation )యాంకర్లను సైతం సుమ ఎంతో ప్రోత్సహిస్తున్నారు.
సుమ టాలెంట్ కు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.సుమ కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.
సుమ అడపాదడపా సినిమాలలో సైతం కనిపించి ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.
అయ్యబాబోయ్.. మీరు ఎప్పుడైనా ఇలాంటి గుడ్లను చూసారా?