శ్రీదేవి కూతురును చిన్నచూపు చూడటానికి కారణమిదేనా?
TeluguStop.com
బాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీదేవి కూతురుగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్ కెరీర్ లో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదనే సంగతి తెలిసిందే.
శ్రీదేవి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలగగా జాన్వీకి మాత్రం ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు.
అందంలో, ప్రతిభలో జాన్వీ తల్లికి ఏ మాత్రం తీసిపోదనే సంగతి తెలిసిందే.అయితే జాన్వీ కపూర్ మాత్రం బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నప్పటికీ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను మాత్రం సొంతం సొంతం చేసుకోలేకపోయారు.
తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీల నుంచి జాన్వీ కపూర్ కు ఆఫర్లు వస్తున్నా జాన్వీ ఆ ఆఫర్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
అయితే జాన్వీ కపూర్ ను బాలీవుడ్ చిన్నచూపు చూడటానికి అసలు కారణం వేరే ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఒక్కో సినిమాకు జాన్వీ కపూర్ 4 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.
భారీ రెమ్యునరేషన్ వల్లే శ్రీదేవి కూతురుకు ఆఫర్లు రావడం లేదని సమాచారం. """/"/
జాన్వీ కపూర్ రెమ్యునరేషన్ ను తగ్గిస్తే ఆమెకు కొత్త ఆఫర్లు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
మరి రెమ్యునరేషన్ ను తగ్గించడానికి జాన్వీ ఆసక్తి చూపుతారో లేదో చూడాల్సి ఉంది.
జాన్వీ రెమ్యునరేషన్ ను తగ్గించకపోతే మాత్రం ఆమెకు ఆఫర్లు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి.
జాన్వీ కపూర్ ఆఫర్ల కోసం రెమ్యునరేషన్ ను తగ్గించడానికి ఇష్టపడతారో లేదో చూడాల్సి ఉంది.
"""/"/
మరోవైపు టాలీవుడ్ దర్శకనిర్మాతలు జాన్వీ కపూర్ ను తమ సినిమాల్లో నటింపజేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు.
అయితే ఎవరి దర్శకత్వంలో జాన్వీ కపూర్ టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తారో చూడాల్సి ఉంది.
జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాలని శ్రీదేవి అభిమానులు సైతం కోరుకుంటూ ఉండటం గమనార్హం.
ఈ సింపుల్ చిట్కా పాటిస్తే మీ ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదు!