రాజమౌళికి మీడియా విషయంలో కోపం వెనుక అసలు కారణమిదా.. అలా కథనాలు రావడంతో?

ఈ మధ్య కాలంలో స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెలుగు మీడియా విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారనే సంగతి తెలిసిందే.

ఇతర భాషల మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చిన విధంగా తెలుగు మీడియాకు జక్కన్న ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదు.

ముఖ్యంగా ప్రింట్ మీడియా విషయంలో జక్కన్న మరింత ఆగ్రహంగా ఉన్నారు.ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైనా మీడియాతో సంబంధం లేకుండా జక్కన్న ప్రీ ప్లాన్డ్ ఇంటర్య్వూలను రిలీజ్ చేశారు.

రిలీజ్ తర్వాత కూడా జక్కన్న తెలుగు మీడియాను పెద్దగా పట్టించుకోవడం లేదు.నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు ఈ మేరకు ప్రతిపాదన తెచ్చిన జక్కన్న మాత్రం ఆ ప్రతిపాదనలను పెద్దగా పట్టించుకోలేదని సమాచారం అందుతోంది.

జక్కన్న ఇలా తెలుగు మీడియాపై కోపంగా ఉండటానికి బాహుబలి1 కారణమని సమాచారం.జక్కన్న ఎంతో కష్టపడి తీసిన బాహుబలి1 కు ఇతర భాషల నుంచి ప్రశంసలు వస్తే తెలుగులో మాత్రం నెగిటివ్ రివ్యూలు వచ్చాయి.

"""/"/ ఆ తర్వాతే జక్కన్న మీడియాకు యాడ్ల విషయంలో కఠినంగా వ్యవహరించారని సమాచారం అందుతోంది.

ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా కొంతమేర నెగిటివ్ కథనాలు రాగా ఆ కథనాలు జక్కన్నను బాగా హర్ట్ చేశాయని బోగట్టా.

ఎన్నో సంవత్సరాలు కష్టపడి సినిమా తీస్తే ప్రేక్షకులు సినిమాను మెచ్చుకుంటున్నా క్రిటిక్స్ మాత్రం సినిమాల విషయంలో నెగిటివ్ కామెంట్లు చేస్తుండటం రాజమౌళిని బాధిస్తోంది.

"""/"/ రాజమౌళి భవిష్యత్తు సినిమాల విషయంలో కూడా తెలుగు మీడియాకు సంబంధించి ఇదే విధంగా వ్యవహరించే అవకాశాలు అయితే ఉన్నాయి.

రాజమౌళి మీడియా విషయంలో కఠినంగా వ్యవహరిస్తే తాత్కాలికంగా ఏ ఇబ్బంది లేకపోయినా భవిష్యత్తులో ఏదో ఒక సందర్భంలో ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు రాజమౌళి మహేష్ కాంబో మూవీ అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

చిన్నోడితో సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్న పెద్దోడు… సంక్రాంతికి వస్తున్నాం టీమ్ తో మహేష్!